చిత్తూరు: చిత్తూరు జిల్లా తొట్టంబేడులో దారుణం చోటు చేసుకుంది. చేతబడి పేరుతో యువతిని మంత్రగాడు మునిరెడ్డి లోబర్చుకున్నాడు. దాదాపు రెండు నెలల పాటు వైద్యం పేరిట అతడి నుంచి యువతి వేధింపులకు గురి అవుతుంది. ఆ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామ పెద్దలు రంగంలోకి దిగి.. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ ఆదేశించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.