నీటి గుంతలో పడి గర్భిణి మృత్యువాత
Published Tue, Oct 25 2016 4:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు ఓ మహిళ మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన డాకూరి సోని(22) మంగళవారం మధ్యాహ్నం మండల కార్యాలయ సముదాయాల సమీపంలో ఉన్న నీటి గుంత వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. కాలుజారి ప్రమాద వశాత్తు నీటి గుంతలో పడిపోయింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో ఆమెను రక్షించేవారు లేకపోయారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీశారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయింది. సోని ప్రస్తుతం 8 నెలల గర్భవతి.
Advertisement
Advertisement