సాక్షి, ముంబై: ఆందోళన సమయంలో బస్సు నడిపినందుకుగాను బెస్ట్ బస్సు డ్రైవర్‌ను తోటి సిబ్బంది చేయి చేసుకున్న ఘటన మలాడ్‌లో జరిగింది. వివరాలు..ములుండ్, మలాడ్ డిపోలో ఆందోళన కారణంగా దాదాపు 300 బస్సు సేవలు నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రశాంత్ కేలుస్కర్ అనే బెస్ట్ బస్సు డ్రైవరు బస్సును నడిపేందుకు పూనుకున్నాడు.
దీన్ని గమనించిన తోటి వర్కర్స్ యూనియన్ సభ్యులు మలాడ్ తూర్పులో బస్సును నిలబెట్టి వారిలో ఒక వ్యక్తి కేలుస్కర్‌ను కొట్టాడు. దీనిపై కేసు నమోదయినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు జరగలేదు. కాగా ఘట్కోపర్, ములుండ్, అంధేరి, దేవ్‌నార్‌లలో నడుస్తున్న బస్సులపై కొందరు రాళ్లు రువ్వారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవలేదు.
బెస్ట్ బస్సు డ్రైవర్‌ను కొట్టిన తోటి సిబ్బంది
Published Fri, May 1 2015 11:22 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement