Malad
-
6 టన్నుల ఐరన్ బ్రిడ్జి అలా మాయమైంది!
ముంబై: ముంబై శివారు మలాడ్(పశ్చిమ)లో 6 వేల కిలోల బరువైన ఇనుప వంతెనను మాయం చేసిన ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ విద్యుత్ కేబుళ్లను అటూఇటూ జరిపేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 90 అడుగుల పొడవైన ఇనుప వంతెనను ఏర్పాటు చేసింది. అక్కడే శాశ్వత వంతెనను నిర్మించడంతో ఇనుప బ్రిడ్జిని గత కొన్ని నెలల క్రితం మరో ప్రాంతంలోని మురుగు కాల్వపైకి తరలించారు. ఈ వంతెన కనిపించకుండా పోయిందంటూ అదానీ సంస్థ జూన్ 26న బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూన్ 6వ తేదీ నుంచే ఆ బ్రిడ్జి మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రాంతంలో సీసీటీ కెమెరాలు లేవు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా జూన్ 11వ తేదీన వంతెన వైపుగా ఒక భారీ లారీ వచ్చిన విషయం రికార్డయింది. ఆ లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కూపీ లాగారు. అందులోనే గ్యాస్ కటింగ్ యంత్రాలను తీసుకువచ్చి 6 టన్నుల ఇనుప వంతెనను కట్ చేసి ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. ఆ బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఉద్యోగే సూత్రధారి అని తేలడంతో అతడిని, సహకరించిన మరో ముగ్గురిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఎత్తుకుపోయిన ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముంబై: స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కొని టీచర్ మృతి
ముంబై: స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కొని 26 ఏళ్ల మహిళా టీచర్ మృతి చెందింది. ఈ విషాద ఘటన మహరాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్లో జెనెల్ ఫెర్నాండేజ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆరో అంతస్తులో క్లాస్ పూర్తి చేసుకున్న జెనెల్.. రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ కోసం వేచి ఉంది. లిఫ్ట్‌లోకి ఎక్కి రెండో ఫ్లోర్ బటన్ నొక్కింది. అయితే లిఫ్ట్ పపైకి వెళ్లడం గమనించిన జెనెల్ అప్పటికీ లిఫ్ట్ తలపులు మూసుకోకపోవడంతో వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. బయటకు వస్తుండగా ఆమె బ్యాగ్ లిఫ్ట్‌లో చిక్కుకుంది. బ్యాగ్‌ను తీసుకునేందుకు టీచర్ ప్రయత్నించగా.. లిఫ్ట్‌లో ఆమె తల ఇరుక్కుపోయింది. లిఫ్ట్ డోర్స్ మధ్యలో చిక్కుకొని జెనెల్ తల నుజ్జునుజ్జైంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన టీచర్ కేకలు విన్న పాఠశాల అధికారులు, సహోద్యోగులు ఆమెకు సాయం చేసేందుకు పరుగెత్తుకొచ్చారు. సుమారు 20 నిమిషాలు కష్టపడి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువతిని బయటకు తీశారు. వెంటనే ఆమెను గోరేగావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై మృతురాలి భర్తకు సమాచారం అందించారు పోలీసులు. ఫెర్నాండెజ్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రైమరీ విభాగంలో అసిస్టెంట్ టీచర్‌గా చేరింది. మృతురాలి బంధువుల్లో ఒకరు కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు -
సోదరి పక్కన ప్రియుడ్ని చూసి...
ముంబై : తమ సోదరిని ప్రేమించినందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు ముంబైకి చెందిన ఓ ఇద్దరు సోదరులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలొని మలాడ్ ప్రాంతానికి చెందిన సైఫ్ అలీ షరాఫత్ అలీ(25) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి సోదరులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా ఇంట్లో ఎవరూలేరని యువతి చెప్పడంతో అలీ మంగళవారం మధ్యాహ్నం ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వాలిద్దరు ఇంట్లో ముచ్చటిస్తుండగా యువతి సోదరులు వసీం బద్రుద్దిన్ ఖాన్(19), అజ్మల్(23) అక్కడికి వచ్చారు. తమ సోదరి పక్కన కూర్చొని ఉన్న అలీని చూసి కోపంతో అతడిపై దాడికి దిగారు. మా చెల్లిని ప్రేమిస్తావా..నీకెంత ధైర్యమంటూ..కత్తితో అతడిని పొడిచేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అలీని అక్కడే వదిలేని ఇద్దరు సోదరులు పారిపోయారు. స్థానికుల సాయంతో ఆ యువతి అలీని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అలీ మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారైన యువతి ఇద్దరు సోదరులను పట్టుకున్నామని, మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
లోకల్ ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య
-
బెస్ట్ బస్సు డ్రైవర్‌ను కొట్టిన తోటి సిబ్బంది
సాక్షి, ముంబై: ఆందోళన సమయంలో బస్సు నడిపినందుకుగాను బెస్ట్ బస్సు డ్రైవర్‌ను తోటి సిబ్బంది చేయి చేసుకున్న ఘటన మలాడ్‌లో జరిగింది. వివరాలు..ములుండ్, మలాడ్ డిపోలో ఆందోళన కారణంగా దాదాపు 300 బస్సు సేవలు నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రశాంత్ కేలుస్కర్ అనే బెస్ట్ బస్సు డ్రైవరు బస్సును నడిపేందుకు పూనుకున్నాడు. దీన్ని గమనించిన తోటి వర్కర్స్ యూనియన్ సభ్యులు మలాడ్ తూర్పులో బస్సును నిలబెట్టి వారిలో ఒక వ్యక్తి కేలుస్కర్‌ను కొట్టాడు. దీనిపై కేసు నమోదయినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు జరగలేదు. కాగా ఘట్కోపర్, ములుండ్, అంధేరి, దేవ్నార్లలో నడుస్తున్న బస్సులపై కొందరు రాళ్లు రువ్వారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవలేదు.