న్యూఢిల్లీ: భారతీయుల్లో గుండె జబ్బులు అధికంగా వారసత్వంగా వస్తున్నాయి. ఈ క్రమంలో వయస్సుతో సంబంధం లేదు. వృద్ధులు మొదలు చిన్న, యుక్త వయస్సులో ఉన్న వారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. వారసత్వం తోపాటు నిత్య జీవనశైలిలో పనిఒత్తిడి కారణంగా కూడా గుండె జబ్బులకు గురవుతున్నారు. వారంలో మూడు రోజులు వ్యాయామం తప్పని సరి. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, నృత్యం, నడక ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పలువురు హృద్యోగ నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంంబర్ 29న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారు దేశప్రజలకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. గుండె జబ్బుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని అంటున్నారు. ఇంకా అభిప్రాయాలు వారి మాటల్లోనే..
వ్యాయమమే మేలు
బీఎల్‌కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీనియర్ కన్సల్‌టెంట్ నీరజ్ బల్లా మాట్లాడుతూ.. గుండె జబ్బుల నివారణకు ప్రతివారం సుమారు 150 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి. నడక లేదా ఈతకొట్టడంతోపాటు సైక్లింగ్, ఏరోబిక్ (ఆక్సీజన్ తీసుకోవడం) వ్యాయామం చేయాలి. దీంతో గుండె సంబంధ కండరాలు బలోపేతం అవుతాయి. వ్యక్తిగతంగా ఎవరి శరీర అవసరాలకు తగినట్లు వారు వ్యాయామాన్ని చేయాలి. అతిముఖ్యమైన విషయమేమిటంటే శరీరం మీద అధిక ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. అలా అయితేనే జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా సాగుతోంది. అత్యధిక అధ్యయనాల్లో ఉపఖండంలోని ప్రజలు కార్డియోవస్కులర్ డిసీజెస్(సీవీడీ)తోపాటు మదుమేహం(డయాబటిక్)తో కూడా సతమతమవుతున్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి.
2.25 మిలియన్లకు చేరిన మరణాలు
వివరాలిలా ఉన్నాయి... అత్యధికంగా భారతదేశంలో గుండె జబ్బుల కారణంగా 2.25 మిలియన్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2015లో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2.94 మిలియన్లకు చేరింది. ఇప్పటికీ గుండె వ్యాధుల తీవ్రత,దాని ప్రభావాన్ని ప్రజలు గుర్తించడం లేదని నిపుణులు అంటున్నారు.
విదేశాల్లోనూ భారతీయులే
‘వాస్తవమేమిటంటే భారతీయులకు గుండెజబ్బులు ఎక్కువగా వారసత్వంగా వస్తున్నాయి. అది కూడా అతి చిన్న వయస్సులోనే వస్తున్నాయని ఇంటర్నేషనల్ కాడ్రియాలోజిస్టు, నోయిడాలోని జయపీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ గుంజాన్ కపూర్ చె ప్పారు. అదే విధంగా విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ స్థానికులకన్నా అధికంగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. బ్రిటన్, యూఎస్, ఆఫ్రికా ఇంకా పలు దేశాల్లో ఉన్న భారతీయులు స్థానికులకన్నా అధికంగా గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని కపూర్ చెప్పారు.
ప్రజల్లో చైతన్య తేవాలి
‘ఘజియాబాద్‌లోని కొలంబియా ఆస్పత్రి చీఫ్ హృద్రోగ నిపుణుడు అనిల్ బన్సల్ మాట్లాడుతూ..ప్రజల్లో ఉన్న అవగాహనా రాహిత్యం కూడా గుండె జబ్బులకు కారణమవుతోంది. ఇందుకు పరిష్కారం ఒక్కటే..గుండె జబ్బుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. అవసరమైన సమాచారం, శాస్త్రీయ పరిజ్ఞానానికి మధ్య ఉన్న దూరాన్ని అధిగమించాల్సి ఉంది. జీవనశైలిలో ప్రజలు తమ అలవాట్లను మార్చుకొనేలా చైతన్యం చేయాలి. ఆరోగ్య సంరక్షణ పట్ల ముందస్తు శ్రద్ధ తీసుకొనెలా చూడాలి. అత్యవసర సమయాల్లోనే డాక్టర్లను సంద్రించే పద్ధతి మంచిదికాదు, ముందుగా దాన్ని ప్రజల మనస్సుల్లో నుంచి తొలగిపోవడానికి అవసరమైన చర్యలు, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి.
అవగాహన కల్పించాలి
శ్రీకాంత్ కేవీ..బెంగళూర్‌లోని నారాయణ హెల్త్ సిటీకి చెందిన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు శ్రీకాంత్ కేవీ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ముందుగా ఒక గ్రూపును ఎంచుకొని గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయిలోనే చిన్నారులకు గుండు జబ్బులపై అవగాహన కల్పించాలి. అదేవిధంగా యువత, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారాన్ని చేపట్టాలి. ప్రజలు పనిచేసే చోట, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆరోగ్య శిభిరాలు నిర్వహించాలి. ఇందులో అంగన్ వాడీ వర్కర్ల బాధ్యత కీలకంగా ఉండేలా చూడాలని చెప్పారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
గుర్గావ్‌లోని పరాస్ ఆస్పత్రి కార్డియాలజిస్టు తపన్ ఘోష్ మాట్లాడుతూ.. అర్బనైజేషన్, అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్లు, ఆహారపు అలవాట్లు, ఉబకకాయంతోపాటు మద్యం, పొగ తాగడం, అధిక ఒత్తిడి, మదుమేహంతోపాటు, వంశపారంపర్యంగా గుండెజబ్బులు రావడానికి ప్రధాన కారణాలని చెప్పారు.
గుండె దడదడ..నివారిద్దామిలా
Published Sat, Sep 27 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement