
పార్టీ నేతకు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత బ్రహ్మానందరెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోమవారం అపోలో ఆసుపత్రికి వెళ్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మానందరెడ్డిని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.