
మీ త్యాగాలు మర్చిపోం: వైఎస్ జగన్
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసాయిచ్చారు.
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసాయిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బుధవారం పోలవరం నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. పోలవరం కోసం భూములు ఇచ్చిన రైతులు, గిరిజనులకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి తీసుకున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్యాకేజీ ఇచ్చి స్థానికుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రతి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే కనీసం రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.