కాంట్రాక్ట్ లెక్చరర్లకు వైఎస్ జగన్ హామీ
విజయనగరం: కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సందర్శించారు. విజయనగరం కలెక్టరేట్ జంక్షన్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వైఎస్ జగన్కు లెక్చరర్లు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్లకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యంతో విజయనగరంలో సోమవారం వైఎస్ జగన్ యువభేరి నిర్వహించిన విషయం తెలిసిందే.