Published
Thu, Oct 6 2016 1:27 PM
| Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
విత్తనాల కోసం ఇన్ని ఇబ్బందులా..? : వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా : రైతులకు పాస్ పుస్తకాలపై వేరుశనగ కూపన్లు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. వైఎస్సార్ జిల్లాలో ఆయన రెండో రోజు పర్యటిస్తున్నారు.
పెండ్లిమర్రిలో వైఎస్ జగన్ను వేరుశనగ రైతులు గురువారం కలిశారు. వేలి ముద్రలు వేయించుకుని విత్తన కూపన్లు ఇస్తున్నారని రైతులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీని వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారని జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. విత్తనాల కోసం రైతులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలా.. ?అంటూ ఆయన అధికారులను నిలదీశారు. వేలి ముద్రలు తీసుకోకుండా విత్తనాలు పంపిణీ చేయాలని వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. దీనిపై పెండ్లిమర్రి రైతులు హర్షం వ్యక్తం చేశారు.