
'స్థానికులకు ఉపాధి కల్పించాలి'
తోటపల్లిగూడూరు : తీర ప్రాంతంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించకపోతే పోరాటాలు తప్పవని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మండపంలో నూతనంగా నిర్మించిన పాఠశాల అ దనపు గదులు, పలు సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే కాకాణి శుక్రవారం ప్రారంభించారు. కాకాణి మాట్లాడుతూ స్థానికంగా ఏర్పాటవుతున్న కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానిక యువతకు అత్యధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. రైతుల నుంచి పరిశ్రమల యాజమాన్యాలు భూములను తీసుకున్న సమయంలో ఇచ్చిన హామీలను మరవరాదన్నారు.
పరిశ్రమల యాజమాన్యాలు తమ మా టను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్హతల పేరుతో స్థానిక యువతకు ఉపాధి క ల్పించపోతే కంపెనీలపై పోరాటం తప్పదని కాకాణి స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా వినియోగించాల్సిన సీఎస్సార్ నిధులను పరిశ్రమలు స్థానిక గ్రామాల అభివృద్ధికే కేటాయించాలన్నారు. పెద్దల మెప్పు కోసం ఇతర ప్రాంతాల్లో అనవసరపు కార్యక్రమాలకు వినియోగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దేశ రక్షణ కోసం ఇటీవల పాక్ ఉగ్రవాదుల చేతుల్లో అశువులు బాసిన వీరజవాన్లకు ఎమ్మెల్యే కాకాణి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్, స్థానిక సర్పంచ్ కాల్తిరెడ్డి సుబ్బారావు, ఎండికళ్ల దయాకర్‌గౌడ్, తహసీల్దార్ రామలింగేశ్వరరావు, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఎంఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.