
చెన్నై: గజ తుపాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం 22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తుపాను కారణంగా సుమారు 80 వేల మంది ప్రజలను 438 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తుండటంతో పుదుకోటైలో ఓ ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, కారైక్కాల్‌లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు చనిపోయారు. తీవ్ర ప్రభావిత ప్రాంతాలలో సహాయక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. గజ తుపాను కారణంగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment