
తమిళనాడు: తిరువారూర్‌లో విద్యార్థి తల వెంట్రుకలను కత్తిరించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. తిరువారూర్ సమీపంలో కుళిక్కరైలో ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన సుందర్ కుమారుడు సురేందర్ (13) 8వ తరగతి చదువుతున్నాడు.
సురేందర్ జుట్టు ఎక్కువగా పెంచుకోవటంపై ఉపాధ్యాయురాలు విజయ అభ్యంతరం తెలిపింది. ఆ విద్యార్థి ఎంత చెప్పిన మారకపోయేసరికి తానే ఒక బ్లేడ్ తెచ్చి తోటి వారి ముందే సురేందర్ తల వెంట్రుకలను కోసింది. ఈమె చర్యపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. సురేందర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నిర్మల్‌రాజ్, విద్యాశాఖ అధికారి స్వామినాధన్ ఆధ్వర్యంలో విచారణ జరిపి టీచర్ విజయను సస్పెండ్ చేశారు. విద్యార్థి తండ్రి సుందర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment