ఒప్పో మరో సెల్ఫీఫోకస్డ్ ఫోన్: ఫీచర్లు లీక్
ఒప్పో మరో సెల్ఫీఫోకస్డ్ ఫోన్: ఫీచర్లు లీక్
Published Sat, May 27 2017 4:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
ఒప్పో మరో సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. రెండు నెలల క్రితమే మార్చిలో ఒప్పో ఆర్9, ఒప్పో ఆర్9 ప్లస్ పేర్లతో కొత్తకొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన ఈ కంపెనీ, ఈ సారి ఒప్పో ఆర్11, ఆర్11 ప్లస్ లతో వినియోగదారులను అలరించబోతుంది. వచ్చే నెల 10న వీటిని విడుదల చేసేందుకు ఒప్పో సిద్ధమవుతోంది. లాంచింగ్ కు ఇంకా కొద్ది రోజులుండగానే ఈ రెండు ఫోన్ల ఫీచర్లు లీకయ్యాయి. లీకైన ఒప్పో ఆర్11 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ ప్లేతో ఆర్11 ఫోన్ వస్తోందని, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీని ఇది కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ నోగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఇది రూపొందిందని టాక్.
దీనిలో మరో ప్రత్యేక ఫీచర్, సెల్ఫీ ఫోకస్డ్ గా 20 మెగాపిక్సెల్ ను దీనిలో కంపెనీ అందించబోతుందట. వెనుక వైపు కూడా 20ఎంపీ, 16ఎంపీలతో రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే 20ఎంపీ సెల్ఫీని అందించడం అంతపెద్ద సర్ ప్రైజ్ ఏమీ కాదని, ఇప్పటికే ఒప్పోకు సెల్ఫీ క్యాపబిలిటీని అందించడం సర్వసాధారణమైందని టెక్ వర్గాలంటున్నాయి. ఇవే ఫీచర్లు ఒప్పో ఆర్11 ప్లస్ లో కూడా ఉన్నాయి. కానీ డిస్ ప్లే సైజు, ర్యామ్, బ్యాటరీ సామర్థ్యాన్ని ఆర్11 ప్లస్ లో పెంచింది. 6 అంగుళాల డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 3880ఎంఏహెచ్ బ్యాటరీ ఆర్11 ప్లస్ లో ఉన్నాయి. ఈ ఫీచర్లు మినహా మిగతా ఫీచర్లలో పెద్దగా తేడాలేదు. ఆశ్చర్యకరంగా ఒప్పో తన ఆర్9, ఆర్9 ప్లస్ స్మార్ట్ ఫోన్లను అమెరికా మార్కెట్లో అమ్మడం లేదు. భారత మార్కెట్ పై ఎక్కువగా దృష్టిపెట్టిన ఒప్పో, కొత్తకొత్త స్మార్ట్ ఫోన్లతో ఇక్కడే తన మార్కును చూపించుకుంటోంది.
Advertisement
Advertisement