
వీడియోకాన్ కొత్త మొబైల్..ధర ఎంత?
వీడియోకాన్ మొబైల్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
న్యూఢిల్లీ: వీడియోకాన్ మొబైల్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సరసమైన ధరలో ‘మెటల్ ప్రో 2’ పేరుతో ఈ డివైస్‌ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.6,999గా నిర్ణయించింది. ఎస్‌ఓఎస్-బీ సేఫ్ ఫీచర్‌తోపాటు ప్రభుత్వం తప‍్పనిసరి చేసిన పానిక్ బటన్‌తో అందుబాటులో వస్తోంది. అంతేకాదు ‘ఈరోస్ నౌ’ సంవత్సరం చందా, గేమ్ లాట్ అనే పెయిడ్ గేమ్‌ను ఉచితంగా అందిస్తోంది. గోల్డ్, స్పేస్ గ్రే కలర్స్‌లో అన్ని రీటైల్ స్టోర్లలో ఈ నెల చివరినుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
మెటల్ ప్రో 2 ఫీచర్లు
5.0 అంగుళాల డిస్‌ప్లే
720x1280 రిజల్యూషన్
2 జీబి ర్యామ్
16జీబీ స్టోరేజ్
128జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
13ఎంపీ వెనుక కెమెరా
3.2 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్
2000ఎంఏహెచ్ బ్యాటరీ
అర్ధవంతమైన ఆవిష్కరణల పట్ల తాము కట్టుబడి ఉన్నామనీ, మెటల్ ప్రో 2 అనేది మెరుగైన మరియు అద్భుతమైన పరికరంగా చెప్పవచ్చనీ వీడియోకాన్ మొబైల్స్ సీఈవో అక్షయ్ దూత్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించామన్నారు. మిరా విజన్ అనే కొత్త టెక్నాలజీతో వస్తుందని తెలిపారు.