
వొడాఫోన్: నెలకు 9జీబీ 4జీడేటా
రిలయన్స్ జియో దెబ్బకు మేజర్ టెలికాంసంస్థలు దిగివస్తున్నాయి.తగ్గింపు ధరల్లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్ కూడా తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన నెట్‌వర్క్‌ను వాడుతున్న పోస్ట్‌పెయిడ్ యూజర్లకు నెలకు 9 జీబీ డేటా చొప్పున 3 నెలలకు గాను 27 జీబీ 4జీ డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
వొడాఫోన్ అధికారిక వెబ్‌సైట్ లో ‘అమేజింగ్ ఆఫర్స్ ’ పేరుతో రెండు ఆఫర్లను ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఆఫర్ పొందాలంటే ఈ నెట్‌వర్క్‌లో పోస్ట్‌పెయిడ్ యూజర్లు అయి ఉండాలి. 4 జీ హ్యాండ్ సెంట్ వాడుతూ ఉండాలి. నెలకు కనీసం 1 జీబీ 4జీ డేటాను ఇప్పటికే వాడుతూ ఉండాలి. దీనికిగాను వొడాఫోన్ రెడ్‌కు చెందిన రూ.499 లేదా, రూ.699 ప్లాన్ కస్టమర్లు(ఎక్సెప్ట్ రెడ్‌ఫ్యామిలీ) అయినవారు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు.
ప్లాన్ రెండు ప్రకారం ఇప్పటికే రెడ్ ప్లాన్ లో ఉన్నవారికి 12 నెలలపాటు 3జీబీ అదనపు డేటాను అందించనుంది. రెడ్ అన్ లిమిటెడ్ ప్లాన్లో ఉన్నవారికే ఈ సదుపాయం. అందుకు గాను యూజర్లు వొడాఫోన్ సైట్‌కు వెళ్లి తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఆ తరువాత వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి. దీంతో ఫ్రీ 4జీ డేటాను క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇక ప్రీపెయిడ్ యూజర్లకు కూడా వొడాఫోన్ ఓ నూతన ప్లాన్‌ను ప్రకటించింది. దాని ప్రకారం 4జీ ఫోన్ ఉన్నవారు రూ.352తో రీచార్జి చేసుకుంటే వారికి 28రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా లభించనుంది. పూర్తి వివరాలకు వొడాఫోన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.