108,104 ఉద్యోగులకు ఉగాది కానుక | 108,104 employees salary hike in telangana | Sakshi
Sakshi News home page

108,104 ఉద్యోగులకు ఉగాది కానుక

Published Tue, Mar 28 2017 7:57 PM | Last Updated on Sat, Aug 11 2018 7:33 PM

108,104 ఉద్యోగులకు ఉగాది కానుక - Sakshi

108,104 ఉద్యోగులకు ఉగాది కానుక

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు రూ.4వేల చొప్పున జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2016 ఏప్రిల్‌ నుంచి వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో  1578మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.

గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు జీతాల పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకు పైలట్లు (డ్రైవర్లు), హెల్త్ టెక్నీషియన్లకు రూ.11,500 వేతనం ఉండేది. ఇపుడు వీరికి అదనంగా రూ.4 వేలు పెంపు వర్తించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement