యోచిస్తున్నామన్న మంత్రి రాజయ్య
సాక్షి, హైదరాబాద్: అవసరమైతే 108 అంబులెన్స్ సర్వీసును తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య గురువారం అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతామన్నారు. వీటి నిర్వహణపై జీవీకే సంస్థ సరిగా వ్యవహరించడం లేదన్న జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. జీవీకే తీరు సరిగా లేకపోవడంతో ఆ సంస్థను ప్రభుత్వం ఇటీవల తీవ్రంగా మందలించిందని చెప్పారు. ఇక, 2018 నాటికి రాష్ర్టంలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
పలు పద్దులకు సభ ఆమోదం
గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం పలు శాఖల పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్, రవాణా, ఐటీ, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయం, హోం, విద్య, వైద్య ఆరోగ్యం, నీటిపారుదల, రెవెన్యూ శాఖల పద్దులపై అన్ని పక్షాల సభ్యులు మాట్లాడారు.
బకాయిలున్న గ్రామ పంచాయతీల్లో విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా చూస్తామని, రాష్ర్ట విభజన సమయంలో చెల్లించని ఉపాధి హామీ వేతనాల బకాయిల సొమ్ము రూ. 94 కోట్లను విడుదల చేస్తామని మంత్రులు చెప్పారు. అధికారాలను గ్రామ పంచాయతీలకు దఖలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలో కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. కాగా, సాయంత్రం నుంచి టీడీపీ సభ్యులెవరూ సభలో లేకపోవడం గమనార్హం. సభ అర్ధరాత్రి 12.40 దాకా సాగింది.
ప్రభుత్వ చేతుల్లోకి 108!
Published Fri, Nov 28 2014 2:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement