ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి | 11 years old boy killed after fall in Water conservation pit | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి

Published Wed, May 18 2016 3:47 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

11 years old boy killed after fall in Water conservation pit

జవహర్‌నగర్: రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్ధానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో తీసిన ఇంకుడుగుంతలో పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇటీవల ఇంకుడుగుంతను తవ్వి వదిలేశారు. ఆపక్కనే నివాసం ఉండే బషీరుల్లా, సమీనా బేగం దంపతుల కుమారుడు ఇబ్రహీం(11) మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. కుమారుడు కనిపించకుండా పోయేసరికి దంపతులు గ్రామంలో వెదికినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం సమయంలో ఇంకుడు గుంత వద్దకు వెళ్లిన స్థానికులకు బాలుడి మృతదేహం కనిపించింది. వెలికి తీయగా అతడు ఇబ్రహీం అని తేలింది. బాలుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement