మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియామకం
సాక్షి, హైదరాబాద్: రెండు జిల్లాల కలెక్టర్లతో సహా, మొత్తం పదమూడు మంది ఐఏఎస్‌లను బదిలీచేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్‌లకు కొత్త కలెక్టర్లను నియమించారు. బదిలీ అయిన అధికారుల్లో నలుగురికి పోస్టింగ్ ఇవ్వలేదు. ‘సెర్ప్’అదనపు సీఈవో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్‌గా పనిచేసిన రోనాల్డ్‌రాస్‌ను నిజామాబాద్ కలెక్టర్‌గా, వాణిజ్య పన్నుల శాఖలో హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఇలంబర్తిని ఖమ్మం కలెక్టర్‌గా, ‘ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్’(అపార్డ్)లో కమిషనర్‌గా ఉన్న జి.డి.ప్రియదర్శినిని మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. కాగా, నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్నను బదిలీచేసి జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక కమిషనర్‌గా నియమించిన సంగతి విదితమే. బదిలీ అయిన అధికారుల వివరాలివీ..