
13నుంచి ఐటీఐ కౌన్సెలింగ్
టెన్త్ గ్రేడ్ పాయింట్ట ఆధారంగా ఎంపిక
ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి
ముందుగా ట్రేడ్స్ ఎంపిక చేసుకోవాలి
జిల్లా కన్వీనర్ సక్రూ
పోచమ్మమైదాన్ : పదో తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2015-2016 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 13నుంచి 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ చేడపతామని ఐటీఐల జిల్లా కన్వీనర్ గుగులోతు సక్రూ తెలిపారు. గురువా రం వరంగల్‌లోని ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలిం గ్ తేదీలు, గ్రేడ్‌ల జాబితాను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 8,716 మంది విద్యార్థులు ఐటీఐలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆన్‌లైన్ పద్ధతిలో కౌన్సెలింగ్ చేడపతామన్నారు. కౌన్సెలింగ్ తేదీలను పోస్ట్, దరఖాస్తు ఫారమ్‌లో నమోదు చేసిన సెల్ నంబరు కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.
అనివార్య కారణాల వల్ల సమాచారం అందని వారు సైతం వారి గ్రేడ్ ఆధారంగా కౌన్సెలింగ్ తేదీని సరిచూసుకుని హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు తమ పదో తరగతి మెమో, కులం, టీసీ తదితర ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్స్‌తో హాజరుకావాలన్నారు. ఈసారి ఎస్టీ అభ్యర్థులకు సైతం వరంగల్ ప్రభుత్వ ఐటీఐలోనే కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ముందుగానే వారు చేరాలనుకు నే ట్రేడ్‌ల ప్రాధాన్యతను ఎంపికచేసుకోవాలని ఆయన అన్నారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో దరఖాస్తుదారులందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్రాను.