
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ఈనెల 1 నుంచి 10 వరకు 162 రైళ్లు అదనంగా నడిపినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. రద్దీ దృష్ట్యా 352 కోచ్‌లను అదనంగా ఏర్పాటు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాలకూ ప్రత్యేక రైళ్లు నడిపినట్లు పేర్కొన్నారు. దీంతో 2 లక్షల మంది ప్రయాణికులు అదనంగా ప్రయాణించినట్లు చెప్పారు. రైల్వేస్టేషన్లలో, బుకింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుందని వివరించారు. దసరా సెలవులు, ఆర్టీసీ సమ్మె కారణంగా రైళ్లలో అనూహ్యంగా రద్దీ పెరి గింది. ప్రధాన స్టేషన్లపై రద్దీని నియంత్రించేందుకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడం వల్ల కొంత ఊరట లభించింది. ఈ 162 రైళ్లలో 98 రిజర్వేషన్ సదుపాయం ఉన్న ఎక్స్‌ప్రెస్‌లు కాగా, 64 జనసాధారణ్ రైళ్లు. కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–కర్నూలు సిటీ, కాచిగూడ–భద్రాచలం రోడ్డు, నాందేడ్–ఔరంగాబాద్ వంటి మార్గాల్లో జనసాధారణ్ రైళ్లను నడిపారు.
Comments
Please login to add a commentAdd a comment