ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల పోలీసులు ఇద్దరు మావోయిస్టులను బుధవారం అరెస్ట్ చేశారు. చర్ల మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన సీపీఐ మావోయిస్టు అద్దంకి కామయ్య, బక్కచింతలపాడు గ్రామానికి చెందిన మాజీ మిలీషియా సభ్యుడు రవ్వా భీమయ్యను చర్లలో అరెస్ట్ చేసినట్టు కొత్తగూడెం ఓఎస్డీ జోయెల్ డెవిస్, భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. కామయ్యపై 51 పోలీసులు కేసులు ఉన్నాయని, వీటిలో 9 హత్య కేసులని పేర్కొన్నారు. అలాగే, భీమయ్యపై 14 కేసులు ఉండగా, వాటిలో 4 హత్య కేసులని తెలిపారు.