cherla
-
యజమాని కొట్టాడని జంప్.. తిరిగి వచ్చేసరికి తనకు అంత్యక్రియలు, అంతా షాక్!
చర్ల (భద్రాద్రి కొత్తగూడెం): కుటుంబ సభ్యుడు ఒకరు అదృశ్యమయ్యాడు.. ఇంతలోనే గుర్తు పట్టలేని స్థితి మృతదేహం లభించింది. తమ వాడేనని ఆ కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. ఇది జరిగిన 12 గంటలకు సదరు వ్యక్తి గ్రామంలో ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడుకు చెందిన బొడ్డు ప్రసాద్ ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామంలోనే ఓ వ్యక్తి వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల యజమాని.. ప్రసాద్‌ను కొట్టాడు. తర్వాత చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అయితే, కొన్ని రోజులకు డ్రైవర్ ప్రసాద్ అదృశ్యం కాగా.. ఆయన తల్లి ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు విచారణ సాగిస్తుండగానే ఈనెల 3న తాలిపేరు ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఈ మృతదేహాన్ని గురువారం వెలికితీసి ప్రసాద్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. (చదవండి: Jubilee Hills: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ) అప్పటికే కుళ్లిన స్థితిలో ఉండటంతో అది ప్రసాద్దిగానే భావించి రాత్రి ప్రాజెక్ట్ సమీపానే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసాద్ పనిచేసిన ట్రాక్టర్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం ప్రసాద్ చర్లలో ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అవాక్కయ్యారు. ట్రాక్టర్ యజమాని మళ్లీ కొడతాడేమోననే భయంతో తాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో తలదాచుకున్నట్లు వివరించాడు. కాగా, రిజర్వాయర్‌లో ప్రత్యక్షమైన మృతదేహం ప్రసాద్‌ది కాదని తేలడం, మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో ఎవరినో హత్య చేసినట్లు భావిస్తూ కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రయాణికులకు బస్సు డ్రైవర్ షాక్.. ఏం చేశాడంటే..!) -
వైరల్: చిటారు కొమ్మన చిరుత.. ఇప్పుడెలా!
సాక్షి, భద్రాద్రి కొత్త గూడెం: గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో పులి సంచారం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. అడవిలో ఉండాల్సిన పులి.. జనారణ్యంలోకి వచ్చి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో ఆసిఫాబాద్‌లో పులి కలకలం రేపిన సంగతి తెలిసింది. నేటికి కూడా దాని జాడ గుర్తించలేకపోయారు అధికారులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి కలకలం సృష్టించింది. వాజేడు మండలంలోని కొంగాల గ్రామ సమీపంలో గల అడవిలో చిరుత కనిపించింది. పశువులు మేపడానికి వెళ్లిన వారికి చెట్టు ఎక్కిన చిరుతపులి దర్శనమిచ్చింది. వెంటనే వారు తన వద్ద ఉన్న సెల్ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. చెట్టు చిటారు కొమ్మన ఉంది ఈ చిరుత. ప్రస్తుతం చెట్టెక్కిన ఈ చిరుత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయం వాజేడు అటవీ శాఖ అధికారులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. దాన్ని క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చిరుతపులి ఉన్న ప్రాంతానికి ఎవర్నీ అనుమతించటంలేదు. ఏదో శబ్దానికి ప్రాణ భయంతో చిరుతపులి చెట్టు ఎక్కి ఉంటుందని భావిస్తున్నారు స్థానికులు. గతంలో ఎన్నడూ లేని విధంగా అడవి జంతువులు గ్రామ సమీపంలో సంచరించిడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: క్రాక్!.. మొదటి నుంచీ ఆ పులిది విచిత్ర ప్రవర్తన -
ఖమ్మం జిల్లాలో బాంబుల కలకలం
ఖమ్మం : ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం మొరవాలగూడెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మావోయిస్టులు రెండు బకెట్ బాంబులు అమర్చారు. స్థానిక ఆటో డ్రైవర్లు ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించేందుకు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సదరు మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఈ బకెట్ బాంబులు పెట్టారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే...జిల్లాలోని చర్ల మండలం అంజనేయపురంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు జరపాలని ఆ పోస్టర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు. -
మావోయిస్ట్ నేత అంజన్న అరెస్ట్
చర్ల (ఖమ్మం జిల్లా) : మావోయిస్ట్ నేత సున్నం బుజ్జి అలియాస్ అంజన్నను గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు పెద్దసిమిలేరు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యాక్షన్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్న అంజన్న పై వివిధ పోలీస్స్టేషన్లలో 41 కేసులున్నట్లు చెప్పారు. ఇతనితోపాటు గుర్రం రాజు,కల్లూరి సమ్మయ్య ,కె.భుజంగరావు అనే ముగ్గురు మావోయిస్ట్ సానుభూతిపరులను కూడా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
విషం తాగి యువకుడు ఆత్మహత్య
చర్ల (ఖమ్మం) : ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పాల్వంచకు చెందిన నరేశ్ అనే ఆటో డ్రైవర్.. చర్లకు చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె నుంచి విడిపోయి 8 నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ రోజు చర్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వాహనం ఢీకొని యాచకుడి మృతి
చర్ల (ఖమ్మం జిల్లా) : గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని గ్రామాల్లో భిక్షాటన చేసే ఒక వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మామిడిగూడెం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి వాహనం ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు. -
చెర్లలో మావోయిస్టు అరెస్ట్
చెర్ల (ఖమ్మం) : మావోయిస్టులకు మందులు సరఫరా చేస్తున్న ఒక మావోయిస్టుతో పాటు ఇద్దరు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోరుకొండ గ్రామానికి చెందిన పుడుం దేవా(20) అనే యువకుడు గత కొంతకాలంగా పామేడు దళంలో సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన కారం హనుమంతు(19), పామేడు గ్రామానికి చెందిన సతీష్(28) అనే ఇద్దరు కొరియర్లతో కలిసి మందులు తీసుకురావడానికి చెర్లకు వచ్చి వెళ్తున్న సమయంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. వారి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
చర్లలో మావోయిస్టు లేఖ కలకలం
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ కిరణ్ కుమార్ ను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి కిరణ్ పేరుతో విడుదలైన ఈ లేఖలో డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో లేఖ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల పోలీసులు ఇద్దరు మావోయిస్టులను బుధవారం అరెస్ట్ చేశారు. చర్ల మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన సీపీఐ మావోయిస్టు అద్దంకి కామయ్య, బక్కచింతలపాడు గ్రామానికి చెందిన మాజీ మిలీషియా సభ్యుడు రవ్వా భీమయ్యను చర్లలో అరెస్ట్ చేసినట్టు కొత్తగూడెం ఓఎస్డీ జోయెల్ డెవిస్, భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. కామయ్యపై 51 పోలీసులు కేసులు ఉన్నాయని, వీటిలో 9 హత్య కేసులని పేర్కొన్నారు. అలాగే, భీమయ్యపై 14 కేసులు ఉండగా, వాటిలో 4 హత్య కేసులని తెలిపారు. -
చెర్లలో మావోయిస్టుల లేఖ కలకలం
ఖమ్మం : ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో ఆదివారం మావోయిస్టుల పేరుతో ఉన్న ఓ లేఖ దర్శనమిచ్చింది. అందులో తరతరాలుగా పీడనానికి గురవుతున్న పేద, ఆదివాసీల బతుకులు బాగుపడాలంటే వారి శ్రమకు తగిన ఫలితం దక్కాలని పేర్కొన్నారు. తునికి ఆకు తెంచే కూలీలకు ఇస్తున్న వేతనాలు పెంచాలంటే కూలీలంతా కలిసి పోరాటం చేయాలని తెలిపారు. అయితే మావోయిస్టుల పేరుతో ఉన్న ఈ లేఖ చెర్ల మండలంలో కలకలం రేపింది.