ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్లలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ కిరణ్ కుమార్ ను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం జిల్లా మావోయిస్టు కార్యదర్శి కిరణ్ పేరుతో విడుదలైన ఈ లేఖలో డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీల్లో భాగంగా పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో లేఖ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.