ఖమ్మం జిల్లాలో బాంబుల కలకలం | maoist posters in cherla khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో బాంబుల కలకలం

Published Sun, Jul 24 2016 9:01 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM

maoist posters in cherla khammam district

ఖమ్మం : ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం మొరవాలగూడెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మావోయిస్టులు రెండు బకెట్ బాంబులు అమర్చారు. స్థానిక ఆటో డ్రైవర్లు ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్ను రప్పించేందుకు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

సదరు మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఈ బకెట్ బాంబులు పెట్టారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే...జిల్లాలోని చర్ల మండలం అంజనేయపురంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు జరపాలని ఆ పోస్టర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement