గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
చర్ల (ఖమ్మం జిల్లా) : గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని గ్రామాల్లో భిక్షాటన చేసే ఒక వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మామిడిగూడెం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి వాహనం ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు.