చర్ల (ఖమ్మం) : ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పాల్వంచకు చెందిన నరేశ్ అనే ఆటో డ్రైవర్.. చర్లకు చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె నుంచి విడిపోయి 8 నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ రోజు చర్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.