22న ‘కో ఆప్షన్’ ఎన్నిక | 22 'co-option' Selection | Sakshi
Sakshi News home page

22న ‘కో ఆప్షన్’ ఎన్నిక

Published Sun, Nov 16 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

22న ‘కో ఆప్షన్’ ఎన్నిక

22న ‘కో ఆప్షన్’ ఎన్నిక

కామారెడ్డి టౌన్ :  హైకోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ ఎ న్నికలు తిరిగి ఈనెల 22న జరుగనున్నాయి. హైకోర్టు నియమించిన ఎన్నికల జాయింట్ అబ్జర్వర్లు (అడ్వొకేట్స్) దివ్యదత్త, నమీరాచామా ఈ మేరకు ప్రకటన చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం చేరుకున్న వారు కమిషనర్ నుంచి వివరాలు సేకరించారు. జూలై 30న జరిగిన కో ఆప్షన్ ఎన్నికలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. వ్యవహారం హైకోర్టుకు చేరడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల జాయింట్ అబ్జర్వర్లు మూడు కో ఆప్షన్ స్థానాలకు జనరల్, మైనార్టీ మహిళ, పురుష అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. పరిశీలన అనంతరం రెండుమూడు రోజులలో తుది జాబితాను ప్రకటిస్తారు. అబ్జర్వర్ల పరిశీలనలో అనర్హుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులలో కొందరిపై అధిక సంతానం, క్రిమినల్ కేసులు ఉన్నట్లు గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సమర్పించిన ఆధారాలను కూడా అబ్జర్వర్లు తీసుకెళ్లారు.

పార్టీలలో మొదలైన టెన్షన్

ముగ్గురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 15 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. దీంతో ప్రధాన పార్టీలలో మళ్లీ టెన్షన్ మొ దలైంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పదవులు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. పాలకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు 17 మంది, టీఆర్‌ఎస్ ను ంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఎనిమిది మంది ఉన్నారు. సీపీఎం, ఇండిపెండెంట్, ఎంఐఎం కౌన్సిలర్లు ఒక్కొక్కరు ఉన్నారు. బీజేపీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. మున్సిపల్ పాలకవర్గంలో ఎక్స్‌అఫీషియో సభ్యులైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కో ఆప్షన్ పదవులను తమ పా ర్టీకే దక్కేలా పోటాపోటీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అబ్జర్వర్ల సమక్షంలో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ బాలోజీ నాయక్ తెలిపారు. ఎన్నికల తేదీని పొడిగించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ కోరుతున్నట్లు తెలిసింది.
 
ఏం జరిగిందంటే


జూలై 30న కామారెడ్డి మున్సిపల్ హాల్‌లో ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగగా, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే గంపగోవర్ధన్ మధ్య ఆధిపత్య పోరు కొనసా గింది. నామినేషన్ వేసినవారిలో అధిక సంతానం, అనర్హులు ఉన్నారని షబ్బీర్ అలీతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలను వాయిదా వే యాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గంప, టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు వాదించారు. ఇరుపార్టీల మధ్య వాగ్వాదం జరు గడంతో చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ సమావేశాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మెజార్టీ సభ్యులైన కౌన్సిలర్‌లు అప్పటికప్పుడు ప్యానల్ కమిటీ చైర్మన్‌గా చాట్ల లక్ష్మిని ఎన్నుకున్నారు. అనంతరం నిట్టు క్రిష్ణమోహన్‌రావు, అప్సరీడేగం, మహ్మద్ సాజిద్‌ను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పార్టీ, చైర్‌పర్సన్ హైకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement