Co-option
-
ఆసక్తికరంగా కోఆప్షన్ ఎన్నిక
నామినేషన్ వేసేందుకు చివరి నిమిషంలో తిరస్కరించిన మృతుడి భార్య వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఏలీయా ఏకగ్రీవం కె.గంగవరం : మండల పరిషత్ కో ఆప్షన్ ఎన్నిక గురువారం ఆసక్తికరంగా జరిగింది. కో ఆప్షన్ సభ్యుడైన సురేష్ అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో గురువారం జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక నిర్వహించారు. మండల పరిషత్‌లో 18 మంది ఎంపీటీ సభ్యులకు 10 మంది వైఎస్సార్ సీపీ వారే ఉన్నారు. సురేష్ భార్యను కోఆప్షన్ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధానపార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ లు భావించాయి. అయితే చివరి నిమిషంలో నామినేషన్ వేసేందు కు ఆమె నిరాకరించింది. ఆ పరిస్థితుల్లో ఎంపీపీ శ్రీనివాస్ చొరవ తీసుకుని ఉదయం 10 గంటలకు పామర్రు గ్రామానికి చెందిన పాస్టర్స్ ఫెలోషిప్ మండల గౌరవ అధ్యక్షుడు డి. ఏలీయాతో చివరి నిమిషంలో నామినేషన్ ఎన్నికల అధికారి కె. కుమార్ అందించారు. టీడీపీ నామినేషన్ దాఖల చేయకపోవడంతో ఏలియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికకు ప్రత్యేకాధికారిగా ఉన్న కె. కుమార్ ధ్రువీకరణ పత్రాన్ని కోఆప్షన్ సభ్యుడు ఏలియాకు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కో ఆప్షన్ సభ్యుడిని పూలదండలతోS అభినందించారు. జెడ్పీటీసీ సభ్యుడు మేడిశెట్టి రవికుమార్, ఆత్మ చైర్మన్ అల్లూరి దొరబాబు, ఎంపీడీఓ సీహెచ్ నరసారావు, తహసీల్దార్ ప్రకాష్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడిగా ఏలియా మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగాఎన్నికైన ఏలియాకు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ పెట్టా శ్రీనివా స్ పార్టీ కండువా వేసి పార్టీ సభ్యుడిగా ప్రకటించారు. మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బత్తుల అప్పారావు, బీసీ నాయకులు సుబ్బారావు, సర్పంచ్‌లు గోవిందరాజు, సాయి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
22న ‘కో ఆప్షన్’ ఎన్నిక
కామారెడ్డి టౌన్ : హైకోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ ఎ న్నికలు తిరిగి ఈనెల 22న జరుగనున్నాయి. హైకోర్టు నియమించిన ఎన్నికల జాయింట్ అబ్జర్వర్లు (అడ్వొకేట్స్) దివ్యదత్త, నమీరాచామా ఈ మేరకు ప్రకటన చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం చేరుకున్న వారు కమిషనర్ నుంచి వివరాలు సేకరించారు. జూలై 30న జరిగిన కో ఆప్షన్ ఎన్నికలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. వ్యవహారం హైకోర్టుకు చేరడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల జాయింట్ అబ్జర్వర్లు మూడు కో ఆప్షన్ స్థానాలకు జనరల్, మైనార్టీ మహిళ, పురుష అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. పరిశీలన అనంతరం రెండుమూడు రోజులలో తుది జాబితాను ప్రకటిస్తారు. అబ్జర్వర్ల పరిశీలనలో అనర్హుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులలో కొందరిపై అధిక సంతానం, క్రిమినల్ కేసులు ఉన్నట్లు గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సమర్పించిన ఆధారాలను కూడా అబ్జర్వర్లు తీసుకెళ్లారు. పార్టీలలో మొదలైన టెన్షన్ ముగ్గురు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 15 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ప్రధాన పార్టీలలో మళ్లీ టెన్షన్ మొ దలైంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పదవులు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. పాలకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు 17 మంది, టీఆర్ఎస్ ను ంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఎనిమిది మంది ఉన్నారు. సీపీఎం, ఇండిపెండెంట్, ఎంఐఎం కౌన్సిలర్లు ఒక్కొక్కరు ఉన్నారు. బీజేపీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ పాలకవర్గంలో ఎక్స్అఫీషియో సభ్యులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కో ఆప్షన్ పదవులను తమ పా ర్టీకే దక్కేలా పోటాపోటీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అబ్జర్వర్ల సమక్షంలో ఎన్నికల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ బాలోజీ నాయక్ తెలిపారు. ఎన్నికల తేదీని పొడిగించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్పర్సన్ కోరుతున్నట్లు తెలిసింది. ఏం జరిగిందంటే జూలై 30న కామారెడ్డి మున్సిపల్ హాల్లో ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగగా, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే గంపగోవర్ధన్ మధ్య ఆధిపత్య పోరు కొనసా గింది. నామినేషన్ వేసినవారిలో అధిక సంతానం, అనర్హులు ఉన్నారని షబ్బీర్ అలీతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలను వాయిదా వే యాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గంప, టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాదించారు. ఇరుపార్టీల మధ్య వాగ్వాదం జరు గడంతో చైర్పర్సన్ పిప్పిరి సుష్మ సమావేశాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం సమావేశం నుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మెజార్టీ సభ్యులైన కౌన్సిలర్లు అప్పటికప్పుడు ప్యానల్ కమిటీ చైర్మన్‌గా చాట్ల లక్ష్మిని ఎన్నుకున్నారు. అనంతరం నిట్టు క్రిష్ణమోహన్రావు, అప్సరీడేగం, మహ్మద్ సాజిద్‌ను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక చట్టవిరుద్ధమని కాంగ్రెస్ పార్టీ, చైర్పర్సన్ హైకోర్టును ఆశ్రయించడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. -
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉద్రిక్తం
నర్సంపేట : నాటకీయ పరిణామాలు, ఉద్రిక్తత పరిస్థితుల మధ్య నగర పంచాయుతీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది. ఆలస్యంగా వచ్చిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు అప్పటికే ప్రారంభమైన కోఆప్షన్ సభ్యుల ఎన్నికను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అరుపులు కేకలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇవీ బలాబలాలు నగర పంచాయతీ పరిధిలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు 6 వార్డులు, కాంగ్రెస్ 12 వార్డులు, ఒక వార్డు ఇండిపెండెంట్, మరొక వార్డు టీడీపీ కైవసం చేసుకుంది. తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఇండిపెండెంట్ టీఆర్ఎస్లో చేరగా, టీడీపీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరాడు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ బలం సమానమైంది. కోఆప్షన్ ఎన్నికలో ఎక్సిఅఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ వైపు, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ టీఆర్ఎస్ వైపు వచ్చాడు. షెడ్యూల్ ప్రకారం ఉదయుం 11 గంటలకు చైర్మన్ పాలె ల్లి రాంచంద్రయ్యు అధ్యక్షతన కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకాగా ఎమ్మెల్యే దొంతి వూధవరెడ్డితో పా టు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సీతారాంనాయుక్ ఒక్కరే ఎన్నికల హాలులోకి చేరుకున్నారు. అప్పటికీ టీఆర్ఎస్ కౌన్సిలర్లు రాలేదు. హాజ రు రిజిస్టర్లో సంతకాలు తీసుకునే క్రవుంలో తాను తర్వాత సంతకం చేస్తానని చెప్పి ఎంపీ బయుటికి వెళ్లి పోయారు. ఆ వెంటనే జనరల్ కోఆప్షన్ ఎన్నిక ప్రారంభించగా కాంగ్రెస్ కౌన్సిలర్ చింతల సాంబరెడ్డి తవు పార్టీకి చెందిన కొంకీస జ్ఞానసాగర్ను సూచించగా పాలారుు శ్రీనివాస్ బలపర్చా రు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు లేకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులెత్తి ఓట్లు వేయుడంతో జ్ఞానసాగర్ గెలిచినట్లు ప్రకటిం చారు. అప్పుడు సమయం 11.15 గంటలవుతోంది. ఎంపీతోపాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికల హాలులోకి చేరుకున్నారు. ఒక కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిగిన విషయూన్ని తెలుసుకున్న వారు అభ్యంతరం తెలిపారు. అయినా ఎన్నిక ప్రక్రియు కొనసాగుతుండంతో నారుుని నర్సయ్యు, గుంటి కిషన్, వెంకటనారాయుణగౌడ్, వుంద శ్రీనివాస్ అడ్డుకున్నా రు. సువూరు గంటపాటు ఇరువర్గాల వుధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింప జేశారు. తర్వాత ఎంపీ సీతారాంనాయుక్ మొదటి కోఆప్షన్ ఎన్నికను అంగీకరించి మిగితా ఇద్దరు సభ్యుల ఎన్నిక నిర్వహించాలని కోరగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మాత్రం ఎన్నిక మొదటి నుంచి నిర్వహించాలని పట్టుబట్టా రు. చైర్మన్ అంగీకరించకపోవటంతో ఎంపీతోపాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లు సవూవేశం నుంచి వెళ్లి పోయూరు. అనం తరం కోఆప్షన్ సభ్యులుగా ఎండీ అలీం, తహెరాభేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చైర్మన్ ప్రకటించారు. చైర్మన్ ఫోన్ లాక్కున్నాడు : కమిషనర్ ఎన్నికలు వుుగిసినట్లు ప్రకటించిన అనంతరం చైర్మన్ తన విధులకు ఆటంకం కలిగే విధంగా తన సెల్‌ఫోన్‌ను లాక్వోడంతోపాటు మినట్ బుక్స్ తన వద్దే ఉంచుకున్నాడని కమిషనర్ గణేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సవుయుంలో ఉన్నత అధికారులతో సంప్రదించేందుకు ప్రయుత్నించగా చైర్మన్ రాంచంద్రయ్యు ఉద్ధేశపూర్వకంగా అడ్డుకున్నాడని, విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. -
ఉత్కంఠగా ‘జడ్పీ’ ఎన్నిక
సాక్షి, ఖమ్మం: జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. టీడీపీకి మెజారిటీ ఉన్నా ఇందులో ఏ వర్గం సభ్యురాలిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారోనని జడ్పీటీసీలంతా ఎదురుచూశారు. చివరకు తుమ్మల వర్గానికి చెందిన గడిపల్లి కవిత టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి అని కలెక్టెర్ డాక్టర్ కె.ఇలంబరితి ప్రకటించడంతో ఉత్కంఠకు తెరతొలగింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమమంతా కలెక్టర్ అన్నీ తానైన డిపించారు. ఉదయం 8 గంటల నుంచి కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. అయితే నిర్ణీత సమయం 10 గంటలలోపు టీడీపీ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా మహ్మద్ మౌలానా, సీపీఎం అభ్యర్థిగా సయ్యద్ జియావుద్దీన్ నామినేషన్లు దాఖలు చేశారు. 9.30 గంటలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెడ్పీలోకి వచ్చి టీడీపీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల బీ ఫారాలు కలెక్టర్‌కు అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థి, పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మ తరఫున కలెక్టర్‌కు బీ ఫామ్ అందజేశారు. ఉదయం ప్రారంభమైన కో ఆప్షన్ సభ్యుల నామినేషన్లు, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత కో ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి అయింది. కలెక్టర్, జెడ్పీ సీఈఓ జయప్రకాశ్‌నారాయణ ఎన్నిక నిర్వహణ బాధ్యతను పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.20 గంటలకు క్యాంపు నుంచి టీడీపీ సభ్యులను పార్టీ నేతలు జెడ్పీ హాల్లోకి తీసుకొచ్చారు. వారి వెంట ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ బాలసాని ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు సభ్యులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరయ్యారు. తర్వాత ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్యతో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ ఎన్నిక సమావేశాన్ని ప్రారంభి మాట్లాడుతూ.. ‘డాక్టర్. కె. ఇలంబరితి అను నేను అంటూ..’ తనను తాను పరిచయం చేసుకున్నారు. కో ఆప్షన్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నియమావళిని సభ్యులకు వివరించారు. 1.15కు సభ్యులకు ప్రమాణ స్వీకార పత్రాలను అందజేయడంతో పాటు సమావేశానికి హాజరైన వారి సంతకాలు సేకరణ పూర్తి అయింది. 39 మంది సభ్యులుండడంతో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు కోరం ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత టీడీపీ సభ్యులు గ్రూపుగా, వారి తర్వాత సీపీఎం, ఎన్డీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీ సభ్యులు ఆత్మ సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను ప్రారంభించారు. సీపీఐకి చెందిన మహ్మద్ మౌలానాను మణుగూరు జెడ్పీటీసీ సభ్యురాలు పి.దుర్గ ప్రతిపాదించగా అశ్వారావుపేట జెడ్పీటీసీ మల్లికార్జునరావు బలపరిచారు. సీపీఎంకు చెందిన సయ్యద్ జియావుద్దీన్‌ను దుమ్ముగూడెం జెడ్పీటీసీ అన్నె సత్యనారాయణమూర్తి ప్రతిపాదించగా బోనకల్ జెడ్పీటీసీ బాణావత్ కొండ బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వీరిద్దరు కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటిచారు. ఆతర్వాత భోజన విరామం అనంతరం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రారంభమైంది. ఈ ఎన్నికకు కోరం కోసం సభ్యుల సంతకాలు తీసుకుని, చైర్ పర్సన్ ఎన్నికను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. టీడీపీ, కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థులుగా వెంకటాపురం జెడ్పీటీసీ గడిపల్లి కవిత, పినపాక జెడ్పీటీసీ జాడి జానమ్మలకు ఆయా పార్టీ నేతలు బీఫారాలు ఇచ్చారని, వారే పోటిలో నిలిచే అభ్యర్థులుగా కలెక్టర్ వెల్లడించారు. గడిపల్లి కవితను కారేపల్లి జెడ్పీటీసీ ఉన్నం వీరేందర్ ప్రతిపాదించగా దుమ్మగూడెం జెడ్పీటీసీ అన్నె సత్యనారాయణమూర్తి బలపరిచారు. జాడి జానమ్మను టేకులపల్లి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్ ప్రతిపాదించగా కామేపల్లి జెడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్ బలపరిచారు. 3.25 గంటలకు చైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. చైర్ పర్సన్ అభ్యర్థిగా గడిపల్లి కవితకు మద్దతు ఇచ్చే వారు చేతులు ఎత్తాలని కలెక్టర్ కోరగా, 19 మంది టీడీపీ, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐ సభ్యుడు ఆమెకు మద్దతు తెలిపారు. జాడి జానమ్మకు మద్దతు తెలిపేవారిని చేతులెత్తాలని కోరగా 10 మంది కాంగ్రెస్ సభ్యులు చేతులెత్తారు. 22 మంది సభ్యులు కవితకు మద్దతు పలకడంతో ఆమె చైర్ పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సభ్యులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. 3.32 గంటలకు కలెక్టర్ వైస్ చైర్మన్ ఎన్నికను ప్రారంభించారు. వైస్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరపాటి వాసుదేవరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టీడీపీ నేతలు బీ ఫాం ఇచ్చారని కలెక్టర్ సమావేశంలో తెలిపారు. పోటీకి ఇతర పార్టీల నుంచి ఎవరూ లేకపోవడంతో అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. సాయంత్రం 3.50 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌గా గడిపల్లి కవిత, బరపాటి వాసుదేవరావు ఎన్నికైనట్లు ధ్రువీకరిస్తూ కలెక్టర్ వారికి డిక్లరేషన్ అందజేశారు. సాయంత్రం 3.55 గంటలకు ఈ ఎన్నిక సమావేశం ముగిసిందని, సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్ కార్యక్రమాన్ని ముగించారు.