కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉద్రిక్తం
నర్సంపేట : నాటకీయ పరిణామాలు, ఉద్రిక్తత పరిస్థితుల మధ్య నగర పంచాయుతీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది. ఆలస్యంగా వచ్చిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అప్పటికే ప్రారంభమైన కోఆప్షన్ సభ్యుల ఎన్నికను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అరుపులు కేకలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఇవీ బలాబలాలు
నగర పంచాయతీ పరిధిలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు 6 వార్డులు, కాంగ్రెస్ 12 వార్డులు, ఒక వార్డు ఇండిపెండెంట్, మరొక వార్డు టీడీపీ కైవసం చేసుకుంది. తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఇండిపెండెంట్ టీఆర్‌ఎస్‌లో చేరగా, టీడీపీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరాడు. దీంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలం సమానమైంది. కోఆప్షన్ ఎన్నికలో ఎక్సిఅఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ వైపు, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ టీఆర్‌ఎస్ వైపు వచ్చాడు.
షెడ్యూల్ ప్రకారం ఉదయుం 11 గంటలకు చైర్మన్ పాలె ల్లి రాంచంద్రయ్యు అధ్యక్షతన కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకాగా ఎమ్మెల్యే దొంతి వూధవరెడ్డితో పా టు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సీతారాంనాయుక్ ఒక్కరే ఎన్నికల హాలులోకి చేరుకున్నారు. అప్పటికీ టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు రాలేదు. హాజ రు రిజిస్టర్‌లో సంతకాలు తీసుకునే క్రవుంలో తాను తర్వాత సంతకం చేస్తానని చెప్పి ఎంపీ బయుటికి వెళ్లి పోయారు. ఆ వెంటనే జనరల్ కోఆప్షన్ ఎన్నిక ప్రారంభించగా కాంగ్రెస్ కౌన్సిలర్ చింతల సాంబరెడ్డి తవు పార్టీకి చెందిన కొంకీస జ్ఞానసాగర్‌ను సూచించగా పాలారుు శ్రీనివాస్ బలపర్చా రు. టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు లేకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులెత్తి ఓట్లు వేయుడంతో జ్ఞానసాగర్ గెలిచినట్లు ప్రకటిం చారు. అప్పుడు సమయం 11.15 గంటలవుతోంది.
ఎంపీతోపాటు టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఎన్నికల హాలులోకి చేరుకున్నారు. ఒక కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిగిన విషయూన్ని తెలుసుకున్న వారు అభ్యంతరం తెలిపారు. అయినా ఎన్నిక ప్రక్రియు కొనసాగుతుండంతో నారుుని నర్సయ్యు, గుంటి కిషన్, వెంకటనారాయుణగౌడ్, వుంద శ్రీనివాస్ అడ్డుకున్నా రు. సువూరు గంటపాటు ఇరువర్గాల వుధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింప జేశారు. తర్వాత ఎంపీ సీతారాంనాయుక్ మొదటి కోఆప్షన్ ఎన్నికను అంగీకరించి మిగితా ఇద్దరు సభ్యుల ఎన్నిక నిర్వహించాలని కోరగా టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మాత్రం ఎన్నిక మొదటి నుంచి నిర్వహించాలని పట్టుబట్టా రు. చైర్మన్ అంగీకరించకపోవటంతో ఎంపీతోపాటు టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సవూవేశం నుంచి వెళ్లి పోయూరు. అనం తరం కోఆప్షన్ సభ్యులుగా ఎండీ అలీం, తహెరాభేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
చైర్మన్ ఫోన్ లాక్కున్నాడు : కమిషనర్
ఎన్నికలు వుుగిసినట్లు ప్రకటించిన అనంతరం చైర్మన్ తన విధులకు ఆటంకం కలిగే విధంగా తన సెల్‌ఫోన్‌ను లాక్వోడంతోపాటు మినట్ బుక్స్ తన వద్దే ఉంచుకున్నాడని కమిషనర్ గణేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సవుయుంలో ఉన్నత అధికారులతో సంప్రదించేందుకు ప్రయుత్నించగా చైర్మన్ రాంచంద్రయ్యు ఉద్ధేశపూర్వకంగా అడ్డుకున్నాడని, విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.