TRS councilors
-
నల్లగొండ టీఆర్ఎస్లో గందరగోళం
-
మున్సిపల్ సమావేశంలో రభస
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశంలో రభస జరిగింది. పాలకవర్గం, ప్రతిపక్ష కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. సమస్యలపై ఎలాంటి చర్చ లేకుండానే మూడో సమావేశం ముచ్చటగా ముగిసింది. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిషనర్ షాహిద్‌మసూద్, వైఎస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ పాల్గొన్నారు. తొలుత సజావుగా సాగినా అంతలోనే గందరగోళం నెలకొంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏజెండా అంశాల్లో ప్రతిపక్షాలకు నామమాత్రపు ప్రాధాన్యం కల్పించారు. కానీ ప్రతిపక్షాల మాటాలకు సమాధానాలు రాలేదు. ఇంతలోనే టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ అకౌంట్ ఆఫీసర్ అర్చన విధులు నిర్వర్తించడం లేదని ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేయాలని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆమెకు అండగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ అలల అజయ్, బీజేపీ ప్లోర్లీ డర్ సురేశ్‌జోషి, వైస్‌చైర్‌పర్సన్ ఫరూక్ అహ్మద్‌లో తీర్మానాన్ని అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ల దొంగబిల్లులు చేయకుంటే సరెండర్ చేస్తామనడం సరికాదని మద్దతిచ్చారు. చైర్పర్సన్ బంధువులు చనిపోవడంతో త్వరితగతిన సమావేశం ముగించేశారు. కంటతడి పెట్టిన ఏవో సరెండర్ చేయాలని కమిషనర్‌కు కౌన్సిల్ సభ్యులు తీర్మానం పెట్టగానే అకౌంట్ ఆఫీసర్ అర్చన కన్నీరు పెట్టుకుంది.తనను చైర్పర్సన్ మామ, భర్త , బంధువులు ఫోన్ చేసి వేధిస్తున్నారని సభలో ఆవేదన వ్యక్తం చేసింది. నేను మీ ఇంటి పనిమనిషిని కాదని.. గజిటెడ్ అధికారినని పేర్కొన్నారు. అధికార..ప్రతిపక్షాల వాగ్వాదం కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని అంశాలు తీర్మానం పొందినట్లు చె బుతూ చైర్మన్ వెళ్లేందుకు సిద్ధపడగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్‌లీడర్ అజయ్ అడ్డుకున్నారు. ‘అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చేతకాదని ఒప్పుకుని వెళ్లండి లేదా కౌన్సిల్ సమావేశం సజావుగా సాగనివ్వండి’ అంటూ హెచ్చరించారు. దీంతో చైర్పర్సన్ కూర్చుంది. వైఎస్ చైర్మన్ ఫరూక్అహ్మద్ మాట్లాడుతూ, ఇటీవల సర్వే నంబర్ 34ను అక్రమంగా ప్రైవేటు వారికి ఎలా మ్యూటేషన్ చేయించారో కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ కౌన్సిలర్లు కల్పించుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. తోపులాట.. స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. అన్ని అంశాలు అమోదించి పదో అంశాన్ని వదిలేయడంతో స్వతంత్ర కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అడ్డువచ్చిన టీఆర్ఎస్ కౌన్సిలర్లను తోసివేశారు. చైర్‌పర్సన్‌ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మా దయతో చైర్మన్ అయి మా వార్డులో పనులు జరిగే అంశాన్ని ఆమోదించరా అంటూ నిలదీశారు. దీంతో చేసేదేమి లేక కమిషనర్ సలహాతో అంశాన్ని ఆమోదిస్తామని.. నిధులు ఉన్నప్పుడే పనులు చేస్తామని చెప్పడంతో స్వతంత్రులు ఆందోళన విరమించారు. పలు పనులకు ఆమోదం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. 22 అంశాలలో సుమారు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో వర్షాకాలంలో నష్టపోయిన కాలనీలు, పాడైన రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. -
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉద్రిక్తం
నర్సంపేట : నాటకీయ పరిణామాలు, ఉద్రిక్తత పరిస్థితుల మధ్య నగర పంచాయుతీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది. ఆలస్యంగా వచ్చిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు అప్పటికే ప్రారంభమైన కోఆప్షన్ సభ్యుల ఎన్నికను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అరుపులు కేకలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇవీ బలాబలాలు నగర పంచాయతీ పరిధిలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు 6 వార్డులు, కాంగ్రెస్ 12 వార్డులు, ఒక వార్డు ఇండిపెండెంట్, మరొక వార్డు టీడీపీ కైవసం చేసుకుంది. తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఇండిపెండెంట్ టీఆర్ఎస్లో చేరగా, టీడీపీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరాడు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ బలం సమానమైంది. కోఆప్షన్ ఎన్నికలో ఎక్సిఅఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ వైపు, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ టీఆర్ఎస్ వైపు వచ్చాడు. షెడ్యూల్ ప్రకారం ఉదయుం 11 గంటలకు చైర్మన్ పాలె ల్లి రాంచంద్రయ్యు అధ్యక్షతన కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకాగా ఎమ్మెల్యే దొంతి వూధవరెడ్డితో పా టు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సీతారాంనాయుక్ ఒక్కరే ఎన్నికల హాలులోకి చేరుకున్నారు. అప్పటికీ టీఆర్ఎస్ కౌన్సిలర్లు రాలేదు. హాజ రు రిజిస్టర్లో సంతకాలు తీసుకునే క్రవుంలో తాను తర్వాత సంతకం చేస్తానని చెప్పి ఎంపీ బయుటికి వెళ్లి పోయారు. ఆ వెంటనే జనరల్ కోఆప్షన్ ఎన్నిక ప్రారంభించగా కాంగ్రెస్ కౌన్సిలర్ చింతల సాంబరెడ్డి తవు పార్టీకి చెందిన కొంకీస జ్ఞానసాగర్ను సూచించగా పాలారుు శ్రీనివాస్ బలపర్చా రు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు లేకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులెత్తి ఓట్లు వేయుడంతో జ్ఞానసాగర్ గెలిచినట్లు ప్రకటిం చారు. అప్పుడు సమయం 11.15 గంటలవుతోంది. ఎంపీతోపాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికల హాలులోకి చేరుకున్నారు. ఒక కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిగిన విషయూన్ని తెలుసుకున్న వారు అభ్యంతరం తెలిపారు. అయినా ఎన్నిక ప్రక్రియు కొనసాగుతుండంతో నారుుని నర్సయ్యు, గుంటి కిషన్, వెంకటనారాయుణగౌడ్, వుంద శ్రీనివాస్ అడ్డుకున్నా రు. సువూరు గంటపాటు ఇరువర్గాల వుధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింప జేశారు. తర్వాత ఎంపీ సీతారాంనాయుక్ మొదటి కోఆప్షన్ ఎన్నికను అంగీకరించి మిగితా ఇద్దరు సభ్యుల ఎన్నిక నిర్వహించాలని కోరగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మాత్రం ఎన్నిక మొదటి నుంచి నిర్వహించాలని పట్టుబట్టా రు. చైర్మన్ అంగీకరించకపోవటంతో ఎంపీతోపాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లు సవూవేశం నుంచి వెళ్లి పోయూరు. అనం తరం కోఆప్షన్ సభ్యులుగా ఎండీ అలీం, తహెరాభేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చైర్మన్ ప్రకటించారు. చైర్మన్ ఫోన్ లాక్కున్నాడు : కమిషనర్ ఎన్నికలు వుుగిసినట్లు ప్రకటించిన అనంతరం చైర్మన్ తన విధులకు ఆటంకం కలిగే విధంగా తన సెల్‌ఫోన్‌ను లాక్వోడంతోపాటు మినట్ బుక్స్ తన వద్దే ఉంచుకున్నాడని కమిషనర్ గణేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సవుయుంలో ఉన్నత అధికారులతో సంప్రదించేందుకు ప్రయుత్నించగా చైర్మన్ రాంచంద్రయ్యు ఉద్ధేశపూర్వకంగా అడ్డుకున్నాడని, విచారణ జరిపి చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.