
వైద్య శాఖలో 251 పోస్టులు మంజూరు
సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ– ప్రాంతీయ కేంద్రం (ఎంఎన్‌జేఐవో–ఆర్‌సీసీ) కోసం 251 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనల మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి కొత్త రూపు తెచ్చేలా ఈ పోస్టులను మంజూరు చేసింది. అలాగే ఆ ఆస్పత్రిలో నిర్వహణ సేవల కోసం 9 ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకానికి అనుమతిచ్చింది.
పోస్టుల వివరాలు..: ప్రొఫెసర్ 5, అసోసియేట్ ప్రొఫెసర్ 13, అసిస్టెంట్ ప్రొఫెసర్ 20, సీనియర్ రెసిడెంట్ 23, బ్లడ్‌బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 1, మెడికల్ ఫిసిషిస్ట్ 6, నర్సింగ్ సూపరింటెండెంట్ 1, బయో మెడికల్ ఇంజనీర్ 1, ఆఫీస్ సూపరింటెండెంట్ 2, సీనియర్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 4, చీఫ్ రేడియోగ్రాఫర్ 2, రేడియోగ్రాఫర్ 10, ఫార్మసిస్ట్ 2, సోషల్ వర్కర్ 6, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–1) 5, ల్యాబ్ టెక్నీషియన్(గ్రేడ్ 2) 8, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, బ్లడ్ బ్యాంక్ సూపర్‌వైజర్ 2, ల్యాబ్ అటెండెంట్ 10, ల్యాబ్ అసిస్టెంట్ 16, మౌల్డ్ టెక్నీషియన్ (సీనియర్) 2, ఈసీజీ టెక్నీషియన్ 2, హెల్త్ సబ్‌ఇన్‌స్పెక్టర్ 1, మెడికల్ రికార్డర్ (టెక్నాలజీ) 3, థియేటర్ అసిస్టెంట్ 10, హెడ్ నర్స్ 6, స్టాఫ్ నర్స్ 85.