నేలకొండపల్లి (ఖమ్మం) : ఆడుకుంటూ వెళ్లి పంట కాలువలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కోనేటి రోశయ్య, శ్రీదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్(3) శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంటి పక్కనే ఉన్న పంట కాలువ వైపు వెళ్లి ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోయి తూము వద్ద చిక్కుకున్నాడు. కాలువలో మృతదేహమై కనిపించిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.