
కొత్తగూడ: వేటగాడు వేసిన విషపు ఎరకు 30 నెమళ్లు మృతి చెందాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం చెరువుముందు తండా అటవీ ప్రాంతం నుంచి నెమళ్లు నెల రోజులుగా గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న ధాన్యం గింజలను ఆహారంగా తీసుకుంటున్నాయి.
వేలుబెల్లి గ్రామానికి చెందిన ఓ వేటగాడు నెమళ్లను చంపేందుకు విషపు ఎరలు తయారు చేసుకుని లక్ష్మీనర్సుకుంట సమీప అటవీ ప్రాంతంలో వెదజల్లాడు. ఇవి తిన్న నెమళ్లు మృతి చెందాయి. వాటి కాళ్లు, ఈకలు, తల తీసేసి మాంసం కిలో రూ.200లకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఎఫ్‌ఆర్వో లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. ఈ విషయం ఇప్పుడే తెలిసిందని, విచారణ కోసం సిబ్బందిని పంపించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment