సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 37 అనుమతిలేని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ ) తేల్చింది. 2018–19 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తం గా 236 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలే దని వెల్లడించింది. వాటి పరిస్థితిపై ఈ నెల 4 లోగా నివేదిక అందజేయాలని రాష్ట్రాలకు లేఖ లు రాసింది. ఆ కాలేజీల్లో తరగతులు కొనసాగుతున్నట్లయితే మూసేయాలని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పింది.
రాష్ట్రంలో సగానికిపైగా నకిలీ కాలేజీలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంది. ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో నివేదిక బాధ్యతను ఉన్నత విద్యా మండలికి ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం కాలేజీ వారీగా వివరాలు తెలుసుకోడానికి విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చర్యలు చేపట్టారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చిన జేఎన్‌టీయూ, ఉస్మాని యా, కాకతీయ యూనివర్సిటీల నుంచి సమా చారం క్రోడీకరిస్తున్నారు.
ఇటీవల ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టిన ప్రవేశాల క్యాంపు కార్యాల యం నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అనుమతుల వివరాలు ఇవ్వాలని కొన్ని డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలకు కూడా ఉన్నత విద్యా మండలి లేఖలు రాసింది. వాటి నుంచి వివరాలు రాగానే క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పాపిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment