మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.
మెదక్ : మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమె వద్ద నుంచి 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయిని సీజ్ చేసి... సదరు మహిళను పోలీసు స్టేషన్కి తరలించారు. పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.