ఖాజీపేట: ఓ హత్య కేసులో ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఖాజీపేట మండలం కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు నిందితులను ప్రవేశపెట్టారు. మండలంలో ఈ నెల 2న సాంబయ్య అనే క్వారీ యజమానితో పాటు, గణపతి అనే వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులైన శివరాత్రి ప్రసాద్, శివరాత్రి నారాయణ, శివరాత్రి కృష్ణ, శివరాత్రి శంకర్, కస్తూరి రవీందర్, కల్లూరి సుధాకర్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.