khajipet
-
హన్మకొండ జిల్లా కాజీపేటలో కారు ఆక్సిడెంట్..మహిళ అక్కడిక్కడే..!
-
మహిళ అదృశ్యం మిస్టరీ వీడేనా?
సాక్షి, ఖాజీపేట: మండలంలో ఇంటి నుంచి 16 రోజుల కిందట బయటకు వెళ్లిన ఓ మహిళ ఆచూకీ నేటికీ లభించలేదు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెతుకుతున్నా.. చిన్న సమాచారం కూడా లభ్యం కాలేదు. ఆమె అదృశ్యం పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. ఆ మహిళ తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం మడూరు గ్రామానికి చెందిన పి.హరితను ఖాజీపేట మండలం సుంకేశుల దళితవాడకు చెందిన కె.రెడ్డయ్యకు 2016లో ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి అత్తతో తరచూ విభేదాలు వస్తుండేవి. ఇవి ఎక్కువై 2017లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న భర్త గుర్తించి కాపాడాడు. తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి వారికి సర్దిచెప్పారు. అనంతరం వారికి ఒక పిల్లవాడు కలిగాడు. అయితే అత్త, కోడలు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉండేది. డిసెంబర్లో తీవ్ర జ్వరంతో పుట్టింటికి వెళ్లింది. అదే నెల 21న అత్తగారి ఇంటికి వచ్చింది. వచ్చిన గంట సేపు మాత్రమే ఉంది. ఇంతలోనే పిల్లవాన్ని అక్కడే వదిలేసి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు మహిళ అదృశ్యంపై తండ్రి రామాంజనేయులు ఎస్ఐ అరుణ్‌రెడ్డికి డిసెంబర్ 21న ఫిర్యాదు చేశాడు. విచారణ చేస్తామని, మీ అమ్మాయిని గుర్తించి తీసుకు వస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారు. అయితే 16 రోజులు గడిచినా గుర్తించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆచూకీ లభించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సెల్‌ఫోన్ ఒక్కటే ఆధారమా! ఆమె వాడిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అయితే 21వ తేది నుంచి ఆమె ఒక్క మారు మాత్రమే ఆన్ చేసి ఆఫ్ చేసింది. ఫోన్ వాడకపోవడం వల్లనే గుర్తించడం ఆలస్యం అవుతోందని మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నమ్మించి.. రూ.25 కోట్లకు ముంచారు) -
తులసితో కేన్సర్‌కు చెక్
కాజీపేట అర్బన్: నిట్.. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది పరిశోధనలకు కేంద్రబిందువు అని. ఎన్నో ఆలోచనలు, ఆశలతో కళాశాలలో విద్యార్థులు అడుగు మోపుతారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి నిట్ ఒక చక్కటి వేదిక. దీనిలో భాగంగానే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధికి తలసి ఆకులతో మందును కనుగొన్నారు. కేన్సర్ వ్యాధి నివారణకు బాధితులు అనేక కంపెనీలకు చెందిన మందులను వాడుతున్నారు. అయితే చాలా మంది కేన్సర్ వ్యాధిగ్రస్తులు సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మరణిస్తున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, తక్కువ ధరలో సహజ సిద్ధంగా యాంటీకేన్సర్ మందును తయారు చేశారు నిట్ విద్యార్థులు. డ్రగ్‌తో పాటు ఆహారంతో వచ్చే కేన్సర్‌ను రూపుమాపడానికి జౌషధాన్ని కనుగొన్నారు.సర్వ రోగ నివారిణి..తులసిని శాస్త్రీయంగా ఆసీమం టెన్యూఫ్లోరం అని పిలుస్తారు. తులసికి అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు నిర్ధారించి వివిధ రకాల మందుల తయారీలో వాడుతున్నారు. జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, శ్వాస, జీర్ణ సంబంధిత వ్యాధులను తులసితో నివారించవచ్చు. ప్రతి రోజు ఉదయం స్నానం చేయగానే తులసి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందనే నానుడి ఉంది. కాగా మనిషి పుట్టుక మొదలుకుని చివరి శ్వాస విడిచే సమయంలో సైతం తులసి నీరు అందించడం భారతీయుల అనవాయితీ. తులసి ఆకుల రసంతో.. తులసి ఆకుల రసంతో యాంటీ కేన్సర్ డ్రగ్‌కు రూపకల్పన చేశారు. నిట్ బయోటెక్నాలజీ విభాగ ప్రొఫెసర్ సతీష్‌బాబు పర్యవేక్షణలో పీహెచ్డీ స్కాలర్స్ చంద్రసాయి, మాధురి పరిశోధన చేపట్టారు. విభిన్న ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు లక్షలాది సూక్ష్మజీవులకు నిలయంగా ఉండగా 40రకాల సూక్ష్మజీవు(బ్యాక్టీరియా)లపై 2014లో పరిశోధనలు ప్రారంభించారు. తొలుత తులసి ఆకురసంతో బ్యాసిల్లస్ స్టాటోస్పెరికస్ ఔషధ గుణాన్ని కనుగొన్నారు. సూక్ష్మజీవులకు న్యూట్రియెంట్ అగార్ అనే మిడియా(ఫుడ్)ను అందించి వివిధ రకాల ప్రయోగాల అనంతరం ఎల్-ఆస్పిరెన్, ఎల్-గ్లుటామిజెన్ అనే ఎంజైమ్‌లను కనుగొన్నారు. వివిధ దశల్లో ఎంజైమ్‌లను అభివృద్ధి చేసి అక్యూట్ లింపోసిటిక్ లుకేమియా అనే కేన్సర్‌ను(బ్లడ్ కేన్సర్) నివారించే ఔషధం(యాంటీ కేన్సర్ డ్రగ్)ను ఆవిష్కరించారు. నాలుగు సంవత్సరాల పరిశోధనల అనంతరం వారి కల ఫలించింది. త్వరలో వివిధ ప్రాణుల మీద ప్రయోగం చేసి మానవాళిని కేన్సర్ వ్యాధి బారినుంచి కాపాడే ఔషధాన్ని అందించనున్నారు. నిట్ ఖాతాలో మరో పేటెంట్... నిట్ ఖాతాలో మరో పేటెంట్ చేరే అవకాశం ఉంది. ఇటీవల మెకానికల్ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ రాపూర్ వెంకటాచలం రూపొందించిన పర్ఫెక్ట్ స్టీరింగ్ మెకానిజం పేటెంట్ సాధించింది. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సతీష్‌బాబు, పీహెచ్డీ స్కాలర్లు తులసి ఆకుల రసంతో రూపొందించిన యాంటీ కేన్సర్ మందునుసైతం పేటెంట్ అనుమతులకు పంపించారు. -
వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
కాజీపేట రూరల్ : తన సుపరిపాలనతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఈ నెల 8న జిల్లాలో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం హన్మకొండ హౌజింగ్‌బోర్డు కాలనీలోని వైఎస్సార్ సీపీ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ జయంతిని సందర్భంగాసేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా , అనుబంధ సంఘాలు, మండల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి కాయిత రాజ్కుమార్యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జన్ను విల్సన్ రాబర్ట్, బోయిని రాజిరెడ్డి, హన్మకొండ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి తిమోతి పాల్గొన్నారు. -
రైలునుంచి జారిపడి విద్యాశాఖాధికారికి తీవ్ర గాయాలు
కాజీపేట రూరల్ : విద్యాశాఖ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి కాజీపేటటౌన్ స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. కాజీపేట జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి, సహచర ఉద్యోగుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన రంగయ్యనాయుడు వరంగల్ రూరల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. హన్మకొండలోని హంటర్‌రోడ్డులో నివాసముంటున్నారు. ఇటీవల ఆయన మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీఅయ్యారు. ఈ క్రమంలో కాజీపేట నుంచి హైదరాబాద్ – సిర్పూర్కాగజ్నగర్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంచిర్యాలలో డ్యూటీకి వెళ్లేందుకు రైలు ఎక్కాడు. కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో రంగయ్యనాయుడు ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి పడ్డాడు. రైలు చక్రాల కింది పడడంతో అతడి రెండు కాళ్లు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు రంగయ్యనాయుడును నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే రంగయ్యనాయుడు ప్రాణానికి ఎలాంటి హాని లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
అమ్రపాలి ఒళ్లో వినాయకుడు; వైరల్
వరంగల్: యువ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి కాటా మరోసారి వార్తల్లో నిలిచారు. వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ఆమె పనితీరుకు ముగ్ధులైన కొందరు యువకులు.. ఏకంగా ప్రతిమను తయారుచేసిన వార్త వైరల్ అయింది. నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటలోని బాపూజీనగర్‌లో ఏర్పాటుచేసిన మండపంలో కలెక్టర్ అమ్రపాలి ఒళ్లో వినాయకుడు కూర్చున్న ప్రతిమను ఉంచారు. శుక్రవారం విగ్రహానికి పూజలు చేశారు. మండపంలో ఉన్న ఆమ్రపాలి విగ్రహం ఫోటోలను ‘హమారా వరంగల్’ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలకొద్దీ లైక్‌లు, వందలకొద్దీ షేర్లు వచ్చాయి. ట్రైసిటీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మండపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకమండపంలో ఒక కలెక్టర్ ప్రతిమకు చోటు కల్పించడం తెలుగురాష్ట్రాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్
కాజీపేట్: లంచం తీసుకుంటూ కాజీపేట్ డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి దొరికాడు. ఓ రైతు నుంచి రూ.6 లక్షలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ అనిల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేస్-2 లో ఉన్న ఆయన ఇంట్లో ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కాజీపేట మార్గంలో నిలిచిన రైళ్లు
పెద్దపల్లి: పెద్దపల్లి-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు బుధవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. బోగీల మధ్య లింకు తెగడంతో మానేరు వంతెనపై గూడ్స్ రైలు నిలిచిపోయింది. పోత్కపల్లి-బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేసన్ల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. గూడ్సు ఆగిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
కొడుకు పెళ్లికాకపోవడంతో దంపతుల ఆత్మహత్యాయత్నం
ఖాజీపేట: జులాయిగా తిరుగుతున్న కుమారుడికి పెళ్లికావడం లేదని మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఖాజీపేట మండలం సిద్ధార్థ నగర్లో నివాసముంటున్న శివరాత్రి నాగేశ్వరరావు(60), ఉపేంద్ర(54) దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాగేశ్వరరావు 4 ఏళ్లక్రితం ఏఎస్ఐగా రిటైర్ అయ్యాడు. భార్యకు 2 ఏళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచం పట్టునే ఉంటోంది. కుమారుడు ఓ కేసులో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లి అయింది. కుమారుడికి ఇంకా పెళ్లి కాలేదు. కుమారుడికి, తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కుమారుడికి పెళ్లి కాకపోవడం, జులాయిగా కేసులతో పోలీసుస్టేషన్ చుట్టూ తిరగడం, భార్యకు బోధకాలు ఉండటంతో జీవితంపై విరక్తి చెంది దంపతులు ఇద్దరూ పురుగుల మందు సేవించారు. భార్య కాసేపటికే మృతిచెందగా..భర్త ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. -
'తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారు'
కాజీపేట రూరల్ : వరంగల్ ఉప ఉన్నికలో ఓటర్లు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆయా పార్టీల నాయకులకు సీఎం కేసీఆర్ గురించి, ఆయన పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులలో టీఆర్ఎస్ మంత్రుల్లా ఆయా పార్టీల నాయకులు, నాటి మంత్రులు ఏమైనా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఉద్యమంలో ప్రజలతో కలిసి రోడ్లపైనే గడిపామని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలకు ప్రజలు అసహ్యించుకుని తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. -
25ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఖాజీపేట (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఖాజీపేట బైపాస్ రోడ్డులో శనివారం సాయంత్రం ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రియాంక రెడ్డి బైపాస్ రోడ్డులో కాపు కాశారు. లారీలో తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను బెంగుళూరుకు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు. -
హత్య కేసులో ఆరుగురికి రిమాండ్
ఖాజీపేట: ఓ హత్య కేసులో ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఖాజీపేట మండలం కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు నిందితులను ప్రవేశపెట్టారు. మండలంలో ఈ నెల 2న సాంబయ్య అనే క్వారీ యజమానితో పాటు, గణపతి అనే వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులైన శివరాత్రి ప్రసాద్, శివరాత్రి నారాయణ, శివరాత్రి కృష్ణ, శివరాత్రి శంకర్, కస్తూరి రవీందర్, కల్లూరి సుధాకర్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
సదానందా..కరుణ చూపవా..
రైల్వే బడ్జెట్ 2014-15 ప్రజలను ఊరిస్తోంది. ప్రతీసారి ఆశలు రేపి ఉసూరుమనిపిస్తున్న బడ్జెట్.. ఈసారి జిల్లాపై కరుణ చూపుతుందని, రైల్వే మంత్రి సదానందగౌడ కాజీపేటకు న్యాయం చేస్తారని కోటి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అటు ప్రజలు, ఇటు రైల్వే కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. కాజీపేట సబ్ డివిజన్ కేంద్రంగా ఉప్పల్, ఆలేరు, చింతల్‌పల్లి తదితర స్టేషన్లతోపాటు ఆన్లైన్లో పనిచేస్తున్న రైల్వే కార్మికులకు కాజీపేట రైల్వే ఆస్పత్రి పెద్దదిక్కుగా ఉంది. ఈ ఆస్పత్రిలో ప్రతిరోజూ 300-400 వరకు ఓపీ ఉంటుంది. రైల్వే కార్మిక కుటుంబాలకు ఇక్కడ నాణ్యమైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో రెఫరల్ ఆస్పత్రులు లేకపోవడంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి, అత్యవసర చికిత్స కావల్సిన వారికి వైద్యం అందడం లేదు. కాజీపేట రైల్వే ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీనికి సంబంధించిన కీలక ఫైల్ రైల్వేబోర్డులో పెండింగ్‌లో ఉంది. రైల్వే బడ్జెట్లో ఈసారైనా దీనికి మోక్షం లభించి, అప్‌గ్రేడ్ హోదా దక్కితే కార్మిక కుటుంబాలకు అన్ని విధాలా నాణ్యమైన వైద్యం అందుతుంది. జిల్లావాసుల చూపంతా ఇప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పైనే ఉంది. కాజీపేటపై పెట్టుకున్న ఆశలు ఈ బడ్జెట్లోనైనా సాకారమవుతాయని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా వెక్కిరిస్తున్న సమస్యలు, రైల్వే కార్మికుల డిమాండ్లు, రైల్వే ఆస్పత్రి అప్‌గ్రేడ్, అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టాలన్న డిమాండ్లకు ఈ బడ్జెట్లోనైనా పరిష్కారం లభిస్తుందని కొండంత ఆశగా ఉన్నారు. - కాజీపేట రూరల్ రైల్వే స్కూల్లో సెంట్రల్ సిలబస్ కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌ను శతాబ్దం క్రితం నిజాం రైల్వే కంపెనీ లిమిటెడ్ కాలంలో నిర్మించారు. జిల్లాలో మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా పేరుగాంచిన ఈ పాఠశాల ఐదేళ్ల క్రితం వరకు ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఈ స్కూల్ దయనీయ స్థితిలో ఉంది. విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ఇందులో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టి రైల్వే కార్మికుల పిల్లలతోపాటు బయటి వారిని కూడా చేర్చుకుంటే ఈ స్కూల్‌కు పునర్వైభవం వస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ కాజీపేటలో అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఎలక్ట్రిక్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్లలో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకు ఈ రెండు లోకోషెడ్లు అనువుగా ఉన్నాయి. ఈ సెంటర్ ఏర్పాటైతే పది, ఇంటర్ మీడియట్ చదివిన వారు అందులో అంప్రెంటిస్ చేసే అవకాశం ఉంటుంది. వీరికి ఏడాది, రెండేళ్ల శిక్షణ కోర్సు ఉంటుంది. శిక్షణ కాలంలో వారికి స్టయిఫండ్ వచ్చి వారితో పనిచేయించుకునే అవకాశం ఉంది. తర్వాత షెడ్లలో ఏర్పడిన ఖాళీలను బట్టి అప్రెంటిస్ కోట కింద శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి కాజీపేటలో అంప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. ప్రతీ బడ్జెట్లోనూ నిరాశే ఎదురవుతోంది. కనీసం ఈ బడ్జెట్లోనైనా ఈ కల నెరవే రుతుందని ఈ ప్రాంతవాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.