గాయపడ్డ రంగయ్యనాయుడు
కాజీపేట రూరల్ : విద్యాశాఖ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి కాజీపేటటౌన్ స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. కాజీపేట జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి, సహచర ఉద్యోగుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన రంగయ్యనాయుడు వరంగల్ రూరల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
హన్మకొండలోని హంటర్‌రోడ్డులో నివాసముంటున్నారు. ఇటీవల ఆయన మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీఅయ్యారు. ఈ క్రమంలో కాజీపేట నుంచి హైదరాబాద్ – సిర్‌పూర్‌కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంచిర్యాలలో డ్యూటీకి వెళ్లేందుకు రైలు ఎక్కాడు. కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో రంగయ్యనాయుడు ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి పడ్డాడు.
రైలు చక్రాల కింది పడడంతో అతడి రెండు కాళ్లు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు రంగయ్యనాయుడును నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే రంగయ్యనాయుడు ప్రాణానికి ఎలాంటి హాని లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment