కొడుకు పెళ్లికాకపోవడంతో దంపతుల ఆత్మహత్యాయత్నం | couples commit sucide while son‘s not get marriage | Sakshi
Sakshi News home page

కొడుకు పెళ్లికాకపోవడంతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Published Mon, Mar 6 2017 8:14 PM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM

కుమారుడికి పెళ్లికావడం లేదని మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

ఖాజీపేట: జులాయిగా తిరుగుతున్న కుమారుడికి పెళ్లికావడం లేదని మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఖాజీపేట మండలం సిద్ధార్థ నగర్‌లో నివాసముంటున్న శివరాత్రి నాగేశ్వరరావు(60), ఉపేంద్ర(54) దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాగేశ్వరరావు 4 ఏళ్లక్రితం ఏఎస్‌ఐగా రిటైర్‌ అయ్యాడు. భార్యకు 2 ఏళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచం పట్టునే ఉంటోంది. కుమారుడు ఓ కేసులో ఇరుక్కుని పోలీస్‌ స్టేషన్‌  చుట్టూ తిరుగుతున్నాడు.

ముగ్గురు కుమార్తెలకు పెళ్లి అయింది. కుమారుడికి ఇంకా పెళ్లి కాలేదు. కుమారుడికి, తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది.  కుమారుడికి పెళ్లి కాకపోవడం, జులాయిగా కేసులతో పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరగడం, భార్యకు బోధకాలు ఉండటంతో  జీవితంపై విరక్తి చెంది  దంపతులు ఇద్దరూ పురుగుల మందు సేవించారు. భార్య కాసేపటికే మృతిచెందగా..భర్త ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement