అమ్రపాలి ఒళ్లో వినాయకుడు; వైరల్‌ | IAS Amrapali statue Along with Lord Ganesh in Khajipet | Sakshi
Sakshi News home page

అమ్రపాలి ఒళ్లో వినాయకుడు; వైరల్‌

Published Fri, Aug 25 2017 7:13 PM | Last Updated on Thu, Sep 27 2018 3:19 PM

అమ్రపాలి ఒళ్లో వినాయకుడు; వైరల్‌ - Sakshi

అమ్రపాలి ఒళ్లో వినాయకుడు; వైరల్‌

వరంగల్‌: యువ ఐఏఎస్‌ అధికారిణి అమ్రపాలి కాటా మరోసారి వార్తల్లో నిలిచారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమె పనితీరుకు ముగ్ధులైన కొందరు యువకులు.. ఏకంగా ప్రతిమను తయారుచేసిన వార్త వైరల్‌ అయింది.

నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటలోని బాపూజీనగర్‌లో ఏర్పాటుచేసిన మండపంలో కలెక్టర్‌ అమ్రపాలి ఒళ్లో వినాయకుడు కూర్చున్న ప్రతిమను ఉంచారు. శుక్రవారం విగ్రహానికి పూజలు చేశారు.

మండపంలో ఉన్న ఆమ్రపాలి విగ్రహం ఫోటోలను ‘హమారా వరంగల్’ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలకొద్దీ లైక్‌లు, వందలకొద్దీ షేర్లు వచ్చాయి. ట్రైసిటీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మండపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకమండపంలో ఒక కలెక్టర్‌ ప్రతిమకు చోటు కల్పించడం తెలుగురాష్ట్రాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement