
సమావేశంలో మాట్లాడుతున్న సంగాల ఈర్మియా
కాజీపేట రూరల్ : తన సుపరిపాలనతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఈ నెల 8న జిల్లాలో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం హన్మకొండ హౌజింగ్‌బోర్డు కాలనీలోని వైఎస్సార్ సీపీ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ జయంతిని సందర్భంగాసేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా , అనుబంధ సంఘాలు, మండల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కాయిత రాజ్‌కుమార్‌యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జన్ను విల్సన్ రాబర్ట్, బోయిని రాజిరెడ్డి, హన్మకొండ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి తిమోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment