
కేసీఆర్ కాన్వాయ్‌లో ఆరు ఫార్చునర్‌లు
త్వరలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కోసం రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కలిపి ఆరు వాహనాలతో కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు.
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కోసం రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కలిపి ఆరు వాహనాలతో కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఫార్చునర్ వాహనాలు కాగా.. జామర్‌తో కూడిన ఒక స్కార్పియోను సైతం కాన్వాయ్‌లో చేర్చారు. కేసీఆర్ లక్కీ నంబరు 6 కావడంతో.. ఆయన సెంటిమెంట్ మేరకే కాన్వాయ్‌లో ఆరు వాహనాలను సమకూర్చినట్లు తెలిసింది. కేసీఆర్ సీఎం పదవి చేపట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఈ ఏర్పాట్లు చేసింది. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతతో పాటు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను చీఫ్ సెక్యూరిటీ అధికారులుగా నియమించారు. మొత్తంగా దాదాపు 150 మందికి పైగా సాయుధ పోలీసులు, అధికారులతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే దీనంతటినీ కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అధికారికంగా ప్రకటించనున్నారు.