620 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం | 620 feet of water to reach the Musee | Sakshi
Sakshi News home page

620 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం

Published Mon, May 5 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

620 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం

620 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం

కేతేపల్లి, న్యూస్‌లైన్ : మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం 620 అడుగులకు చేరుకుంది. గత రబీ సీజన్ మూసీ ప్రధాన కాల్వలకు నీటి విడుదల నిలిపివేసే సమయానికి (ఏప్రిల్11నాటికి) ప్రాజెక్టులో నీటిమట్టం 614 అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత మూసీగేట్ల లీకేజీలు, సూర్యాపేట పట్టణ ప్రజలకు తాగునీటి విడుదలతో 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో   612 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరుకుంది.

ఈనేపథ్యంలో రెండు రోజులుగా ఎగువ మూసీ ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అకాల వర్షాలకు దిగువన గల మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. మూసీ ఎగువన ఉన్న చెరువులు, కుంటల్లో చేపలు పడుతుండటంతో కొత్తగా వచ్చే నీరుఆయా చెరువుల్లోకి చేరకుండా అడ్డుకట్టలు వేశారు. దీంతో  వచ్చే వరద నీరంతా నేరుగా దిగువన గల మూసీ రిజర్వాయర్‌లోకి చేరుతుంది. దీంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం 612 అడుగుల నుంచి ఒక్కో అడుగు పెరుగుతూ ఆదివారం సాయంత్రానికి 620 అడుగులకు చేరుకుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement