మూసి మూరిసేనా..? | musi-nadi-project....? | Sakshi
Sakshi News home page

మూసి మూరిసేనా..?

Published Sat, Jun 14 2014 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

మూసి మూరిసేనా..?

మూసి మూరిసేనా..?

- గంపెడాశతో ఎదురుచూస్తున్న రైతాంగం    
- సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ ప్రాజెక్టు   
- గేట్ల లీకేజీలతో వృథా అవుతున్న నీరు   
- ఏటేటా పేరుకుపోతున్న పూడిక

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లో పురుడు పోసుకుని కరువు నేలను వుుద్దాడుతూ నల్లగొండ జిల్లాలో ప్రవేశించిన వుూసీ నదిపై కేతేపల్లి వుండలం బొప్పారం, అర్వపల్లి వుండలం రావుచంద్రపల్లి సరిహద్దులో 1954-63 మధ్య కాలంలో మూసీ ప్రాజెక్టును నిర్మించారు. 645అడుగుల సామర్థ్యం గల ప్రా జెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని 42 గ్రామాల్లో సుమారు 42వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. అలాగే 26 చెరువులు, కుంటలను నింపుతూ ప్రజల దాహార్తిని తీరుస్తుంది.
 
శిథిలావస్థలో కాల్వలు
ప్రాజెక్టు కుడి, ఎడవు కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. 1991-92 తర్వాత డిస్ట్రిబ్యూట రీలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో అధ్వానం గా తయారయ్యాయి. అలాగే రిజర్వాయర్ ఆనకట్టకు ఉన్న లైనింగ్ కూడా దెబ్బతిని రాళ్లు ఊడిపోయే పరిస్థితి నెలకొంది. కుడి కాల్వ 47కిలో మీటర్లు, ఎడమ కాల్వ 34కిలో మీటర్లు మేర విస్తరించి ఉన్నాయి. కుడి కాల్వ పరిధిలో 52 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా వీటి ద్వారా నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని కేతేపల్లి, వేములపల్లి, తిప్పర్తి మండలాలకు చెందిన సుమారు 20వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ప్రతి ఏటా కాల్వలకు మరమ్మతులు చేపట్టకుండానే నీటిని వదులుతుండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరందక సిరులు పండే భూములన్నీ బీడుబారుతున్నాయి.

కలగా త్రివేణి సంగమం
మూసీ రిజర్వాయర్‌లో ఏఎమ్మార్పి కాలువ ద్వారా కృష్ణా, శ్రీరాంసాగర్ కాల్వ ద్వారా గోదావరి నదీ జలాలు కలిసేలా చేసి ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా మారుస్తామని గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి.

డ్యామ్‌కు పొంచి ఉన్న వుుప్పు..
నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల వుధ్య ఉన్న వుూసీ ప్రాజెక్టు డ్యామ్‌పై నుంచి పెద్ద వాహనాలు సైతం అడ్డూ అదుపు లేకుండా వెళ్తుండడంతో ప్రవూదం పొంచి ఉంది. రాక పోకల నిమిత్తం దిగువ భాగాన వురో బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు. డ్యామ్‌కు ఇరువైపులా కట్టపై భాగాన రహదారి సౌకర్యం కూడా అస్తవ్యస్తంగా ఉంది.

కళ తప్పిన పర్యాటక కేంద్రం
మూసీ ప్రాజెక్టు డ్యామ్ రెండు గుట్టల నడుమ నిర్మితమైంది. డ్యామ్ దిగువన ప్రాజెక్టు ఇంజనీర్ కార్యాలయాలు, సూర్యాపేటకు మంచినీరు అందించే సంపు కార్యాలయ ఆవరణ, అతిథి గృహం పరిసరాలు పచ్చిని గార్డెన్లు, రకరకాల పూల మొక్కలు, నీటిని విరజిమ్మే ఫౌంటేషన్లతో ఆకర్షంగా ఉండేది. నేడు అవి కనిపించకుండా పోయాయి. పర్యాటకుల సందడి తగ్గిపోయింది.

తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం..
1963లో మూసీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా రిజర్వాయర్‌లో పూడిక తీయకపోవడంతో పూడిక భారీ ఎత్తున పేరుకుపోయింది. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిన సమయంలో గేట్లను ఎత్తితే పూడిక బయటకు పోయేందుకు డ్యామ్ దిగువ భాగాన ఏర్పాటు చేసిన పది స్కవర్ గేట్లు ఏర్పాటు చేసినా పనిచేయకపోవడంతో అధికారులు వాటిని కాంక్రీట్‌తో పూర్తిగా మూసివేశారు. నిర్మాణ సమయంలో రిజర్వాయర్ నీటి సామర్థ్యం 5.27టీఎంసీలు కాగా పదమూడేళ్ల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా 4.83టీఎంసీలకు పడిపోయిందని తేల్చారు. దీంతో ఆయకట్టును 35వేల ఎకరాలకు కుదించారు. 1996లో మరోసారి సర్వే చేసి 4.47 టీఎంసీలుగా నిర్థారిం చారు. ప్రస్తుతం 4టీఎంసీల సామర్థ్యం కూడా ఉండకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. పూడిక విషయమై ప్రతి ఏటా ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నా ఎలాంటి చర్యలు లేవు.

లీకేజీలతో నీరు వృథా..
ప్రాజెక్టుకు మొత్తం 30గేట్లు ఉండగా అందులో పది గేట్లు 15ఏళ్ల నుంచి పనిచేయడం లేదు. ప్రస్తుతం 20గేట్లు పని చేస్తున్నారుు. 2005లో కురిసిన భారీ వర్షాలకు 1.80లక్షల క్యూసెక్కుల వరదనీరు ఒక్కసారిగా ప్రాజెక్టులోకి చేరడంతో మూసీ గేట్లు తెరిచారు. ఈ క్రమంలో గేట్లకు కింది భాగంలో ఉన్న రబ్బరు సీళ్లు ఊడిపోయాయి. దీంతో 8వ రెగ్యులేటర్ గేట్, 12క్రస్ట్ గేట్ వద్ద లీకేజీలు ఏర్పాడ్డాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ప్రతి రోజు 30 నుంచి 50 క్యూసెక్కుల వరకు నీరు వృథాగా దిగువకు వెలుతోంది.

కొరవడిన పర్యవేక్షణ
 సరిపడ సిబ్బంది లేకపోవడంతో ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొరవడింది. కుడి కాల్వ పరిధిలో 25మంది గ్యాంగ్ మెన్లు ఉండాల్సి ఉండగా ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఎడమ కాల్వ కింద 52 మందికి 11 మాత్రమే పనిచేస్తున్నారు. ప్రధానంగా గజ ఈతగాళ్లు, డైవర్, డైవింగ్ సెట్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నారుు.

ఈ ఏడాది కూడా మరమ్మతులు లేనట్లేనా..?
మూసీ మరమ్మతులు ఈ ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు. ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న ఎర్త్ డ్యామ్‌పై బీటీ రోడ్డు, గేట్ల లీకేజీల మరమ్మతుల కోసం జనవరిలో ప్రభుత్వం *11.87కోట్లు మంజూరు చేసింది. టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ రెగ్యులేటరీ గేట్లకు మరమ్మతులు నిర్వహించాలంటే రిజర్వాయర్ నీటిమట్టం డెడ్‌స్టోరేజీ(610 అడుగులు) వద్ద ఉండాలి. ఏప్రిల్ చివరి నాటికి నీటిమట్టం 612 అడుగులకు చేరింది.

మరో రెండు అడుగులు తగ్గితే మరమ్మతులు నిర్వహించవచ్చునని అనుకున్నా.. ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు అడ్డురావడంతో పనులు చేపట్టలేదు. ఈ క్రమంలో హైదరాబాద్, మూసీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నీటి మట్టం 629 అడుగులకు చేరింది. మరో 10 అడుగుల నీటిమట్టం పెరిగితే పంటల సాగుకోసం ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మరమ్మతులు చేపట్టాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement