- పీఎంకేఎస్‌వై కింద గుర్తించిన 11 ప్రాజెక్టులు కార్పొరేషన్ పరిధిలోనే
- ఈ ప్రాజెక్టులకు రుణాలివ్వాలని నాబార్డును కోరిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగినన్ని రుణాలిచ్చి సహకరించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నాబార్డ్ అధికారులను కోరారు. మంగళవారం నాబార్డు అధికారులతో మంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. పీఎంకేఎస్‌వై కింద కేంద్రం గుర్తించిన 11 సాగునీటి ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తేనున్నట్లు తెలిపిన మంత్రి... ఈ ప్రాజెక్టుల పూర్తికి గానూ కార్పొరేషన్‌కు రూ.7,900 కోట్లు ఇవ్వాలని విన్నవించారు. ఎఫ్‌ఆర్‌బీఎంతో నిమిత్తం లేకుండా రుణాలివ్వాలన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 పెండింగ్ ప్రాజెక్టులలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులున్నట్టు మంత్రి చెప్పారు.
ఇందులో దేవాదుల, రాజీవ్ బీమా, ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ, నీల్వారుు, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమ్రుం భీమ్, జగన్నాథపూర్ పెదవాగు, గొల్లవాగు, వరద కాలువ ఉన్నాయని వివరించారు. కేంద్రం ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక సాగునీటి పారుదల నిధి నుంచి నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయడానికి గాను దీర్ఘకాలిక సాగునీటి నిధి (ఎల్‌టీఐఎఫ్) కింద రూ.20వేల కోట్లను కార్పస్ ఫండ్‌గా సమకూర్చిందని ఆయన చెప్పారు. ప్రాధాన్యతా పరంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర జలవనరుల శాఖ, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ, నాబార్డుల మధ్య గత సెప్టెంబర్ 6న ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందంలో కుదిరిన వడ్డీ రేట్ల ప్రకారం కాళేశ్వరం కార్పొరేషన్‌కు రుణాలివ్వాలని మంత్రి కోరారు.
కాళేశ్వరం కార్పొరేషన్‌కు 7,900 కోట్లు
Published Wed, Nov 16 2016 3:18 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement