సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ జ్యోతికిరణ్ ఇళ్లపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడి చేశారు. జ్యోతి కిరణ్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నిజామాబాద్, హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలోని నివాసంతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఇప్పటివరకు జహీరాబాద్‌లో 30 ఎకరాల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లాలో 14 ప్లాట్స్, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, 75 తులాల బంగారం, అరకిలో వెండి స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. రూ. 2 కోట్ల వరకు అక్రమ ఆస్తులు గుర్తించామన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి