ఖజానాకు తగ్గుతున్న ఆదాయం
అమ్మకం పన్నులో తగ్గుదల నమోదు
సెప్టెంబర్‌లో ఆశించినంతగా రాని ఆదాయుం
ప్రభుత్వం ఆశించింది రూ. 2,248 కోట్లు
26వ తేదీనాటికి వచ్చింది రూ. 1,980.84 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. హైదరాబాద్ కేంద్రంగా ఆదాయం గణనీ యంగా ఉంటుందని ఆశించినప్పటికీ.. అన్నిరకాలుగా ఆదాయుంలో తగ్గుదల నమోదు అవుతూ వస్తోంది. ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం వల్ల ఆదాయుం పుంజుకోవడంలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రతీరోజు వచ్చే ఆదాయాన్ని సమీక్షించుకోవడం తప్ప.. ఆదాయం పెంచే మార్గాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్ట లేకపోతున్నారు. దానికితోడు రాష్ట్రస్థాయి, క్షేత్రస్థాయిలో అధికార వ్యవస్థ పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల కూడా పరిస్థితి కుంటుపడిందని పరిశీలకు లు అభిప్రాయుపడుతున్నారు. ఆదాయుం తగ్గ డం ప్రభుత్వానికి మింగుడుపడని వ్యవహారం గా మారింది ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన ప్రభుత్వం వాటిపై ఇప్పటి వరకు కనీసం దృష్టి కూడా సారించలేదు. పథకాల్లోనే కోత పెట్టడం ద్వారా ఖర్చు తగ్గించవచ్చని భావిస్తోం ది తప్ప.. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టడంలేదు.
ప్రభుత్వ భూముల విక్రయంతో భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వుందకొడిగా ఉండడంతో ఆ దిశలో అడుగు వుుం దుకు పడడంలేదు. వాణిజ్యపన్నుల విభాగంలో రాబ డి 85 శాతం కూడా దాటడం లేదు. సెప్టెంబర్ ఆదాయంలో 80 శాతం కూడా దాటలేదు. సెప్టెంబర్‌లో అమ్మకం పన్ను, ఎక్సై జ్, మో టారు వాహనాల పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వినోదపన్ను, భూఆదాయం, వృత్తిపన్ను, చెరకు సెస్సు, నాలా పన్ను, అటవీ, మైన్స్, అన్ని కలిపి రూ. 2,248 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా.. 26వ తేదీ నాటికి రూ. 1,980.84 కోట్లు మాత్రమే వచ్చినట్లు అధికారవర్గాలు వివరించాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖనుంచి ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే ప్రధానంగా అధిక ఆదాయం రావాల్సి ఉన్నా.. అంతగా రాకపోవడం గమనార్హం.