ప్రాణం మీదికి తెచ్చిన టిక్కెట్ లేని ప్రయాణం | A man injured who tried to boarded the train | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదికి తెచ్చిన టిక్కెట్ లేని ప్రయాణం

Published Sun, Nov 29 2015 8:23 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

A man injured who tried to boarded the train

ఓ వ్యక్తి రైలు ఎక్కుతూ కింది జారిపడి తీవ్రంగా గాయపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి టిక్కెట్ లేకుండా రైలు ఎక్కాడు.

టీసీ వచ్చి వచ్చే స్టేషన్ లో టికెట్ తీసుకోవాలని సూచించాడు. దీంతో ధారూర్  రైల్వేష్టేషన్ లో టికెట్ కోసం దిగాడు. రైలు కదలటంతో టికెట్ కొనకుండానే.. రైలు ఎక్కబోయి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణీకుడికి 45 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అతనిది కర్ణాటకగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement