జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో సోమవారం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మమత్యాయత్నం చేశాడు. జగిత్యాల మండలానికి చెందిన చీమల లక్ష్మణ్(35)కు ఎకరా పొలం ఉంది. ఆ ఎకరా పొలాన్ని జగిత్యాలకు చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. దీంతో కలెక్టరేట్ ఆఫీసుకు వెళ్లి పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది సోమవారం అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు లక్ష్మణ్‌ను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.